ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఔరంగాబాద్‌కు చెందిన ఆయన పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ కూర్చున్న చిత్రాన్ని సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు. రాబోయే ఎన్నికల కోసం ప్రధాని మోదీ ఓవైసీకి శిక్షణ ఇస్తున్నారని ఫోటోను పోస్టు చేసిన వ్యక్తులు చెప్పుకొచ్చారు.
‘‘వచ్చే ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఒవైసీకి శిక్షణ ఇస్తున్నారు. అధికారం కోసం ఏదైనా జరగవచ్చు కాబట్టి యువత జాగ్రత్తగా ఉండాలి” అని ఫేస్‌బుక్ పోస్ట్ ఉంది.
ట్విట్టర్ యూజర్లు 'భాయ్.. భాయ్' అంటూ కూడా ఈ పోస్టును వైరల్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
ఈ చిత్రాన్ని డిజిటల్‌గా ఎడిట్ చేశారని న్యూస్‌మీటర్ కనుగొంది. అసలైన ఫోటోలో ఓవైసీతో పాటూ ఉన్నది ఎంఐఎం పార్టీ సభ్యులు షరీక్ నక్ష్‌బందీ, ఇంతియాజ్ జలీల్ లు అని తెలుస్తోంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఫిబ్రవరి 7న AIMIM ఔరంగాబాద్ సిటీ ప్రెసిడెంట్ షేర్క్యూ నక్ష్‌బంది పోస్ట్ చేసిన అసలైన చిత్రాన్ని Instagramలో మేము కనుగొన్నాము.
ఒరిజినల్ ఫోటోకు వైరల్ ఫోటోకు ఉన్న పోలికలను మీరు ఇక్కడ చూడవచ్చు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఆ ఫోటో మోదీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో చూశాం. అక్టోబర్ 9, 2018న పోస్టు పెట్టారు. ఆ ఫోటోలో ఆయన కెనడా కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు ఆండ్రూ స్కీర్‌తో మాట్లాడుతూ ఉన్నారు.
“Happy to meet Hon. @AndrewScheer, Canada’s Leader of the Opposition. Stressed the significance of strong India-Canada relations and wished him a pleasant stay in India, ” అంటూ అందులో చెప్పుకొచ్చారు.
రెండు ఫోటోల మధ్య ఉన్న తేడాలను మీరు గమనించవచ్చు.
సెప్టెంబరు 28 న ముస్నిఫ్ డైలీ ఒక నివేదికలో ప్రధాని మోదీ, ఒవైసీల డిజిటల్ మార్ఫింగ్ చిత్రంపై వార్తలను నివేదించారు. హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీసులు ఈ విషయంపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారు.
కాబట్టి, అసదుద్దీన్ ఒవైసీతో ప్రధాని మోదీ ఉన్న వైరల్ చిత్రం మార్ఫింగ్ చేశారని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam