రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మూడు నెలల పాటు ఉచిత మొబైల్ రీఛార్జ్ ని ప్రకటించారని వాట్సాప్ సందేశం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ ఉంది. నిజమేనని నమ్మి చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
“Rahul Gandhi is giving 3 Months Free recharge to all Indian users so that more and more people can vote for Congress in the 2024 elections and Congress government can be formed again.Click on the link given below to get 3 Months Free Recharge. (Last Date – 16 NOVEMBER 2023) (sic)” అంటూ మెసేజీని షేర్ చేశారు. ఒక క్లిక్ తో మూడు నెలల ఫ్రీ రీఛార్జ్ వస్తుందని ఆ మెసేజీలో తెలిపారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని అందులో కోరారు.
“https://www.inc.in@congress2024.limitedoffer.xyz.” అనే లింక్ ను వైరల్ పోస్టుకు ట్యాగ్ చేశారు.
నిజ నిర్ధారణ :
రాహుల్ గాంధీ ఉచితంగా మొబైల్ రీఛార్జ్‌ను అందించడం లేదని NewsMeter బృందం కనుగొంది.
ఏదైనా అధికారిక మీడియా హ్యాండిల్‌లో లేదా కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్స్‌లో రాహుల్ గాంధీ చేసిన అటువంటి అధికారిక ప్రకటనను కనుగొనడానికి మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. కానీ దానికి సంబంధించి ఎటువంటి ఫలితాలను కూడా కనుగొనలేక పోయాము.
తదుపరి సెర్చ్ ద్వారా.. మేము రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ చేసిన 'మూడు నెలల మొబైల్ రీఛార్జ్' ప్రకటనను కవర్ చేసే ఏదైనా మీడియా కథనాన్ని గుర్తించడానికి ప్రయత్నించాము. కానీ అలాంటిది కనుగొనడంలో విఫలమయ్యాము. ఈ మెసేజీ నిజంగా కాంగ్రెస్ పార్టీ కానీ.. రాహుల్ గాంధీ నుండి కానీ వచ్చి ఉండి ఉంటే అది ఖచ్చితంగా ప్రధాన స్రవంతి మీడియా దృష్టిని ఆకర్షించి ఉండేది.
అంతేకాకుండా, మెసేజీతో పాటూ ఉన్న లింక్‌ను నిశితంగా గమనించగా.. అందులో అధికారిక కాంగ్రెస్ డొమైన్ లేదు. ఆ లింక్ సందేహాస్పదంగా ఉన్నట్లు మేము గుర్తించాము.
దీని నుండి క్యూ తీసుకొని, మేము డొమైన్ ఐడెంటిఫైయర్ వెబ్‌సైట్ Whois ద్వారా వెబ్‌సైట్‌ను రన్ చేసాము. ఈ డొమైన్ 9 నవంబర్ 2023న రిజిస్టర్ చేశారని కనుగొన్నాము. అలాగే, ఇది ప్రైవసీ ప్రొటెక్ట్ అనే సంస్థ పేరు మీద నమోదు చేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న మెసేజీ ఫేక్ అని మేము గుర్తించాము.
Credits : Sunanda Naik