పాత రూ. 100 నోట్లు చట్టబద్ధమైనవిగా పరిగణించరని సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అవుతూ ఉంది. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చి 31, 2024ని ఈ నోట్ల మార్పిడికి గడువుగా నిర్ణయించిందంటూ ప్రచారం చేస్తున్నారు.
“This old Hundred Rupees Note is No Longer Valid. @RBI have Given a Deadline to Exchange the Notes 31 March 2024. #RBI #Currency. (sic)” అంటూ ప్రీమియం యూజర్లు కూడా పోస్టులు పెట్టారు.
నిజ నిర్ధారణ :
ఆర్‌బీఐ పాత 100 రూపాయల నోటు గురించి అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము RBI రూ.100 నోటును చెలామణి నుండి తీసివేసినట్లు, మార్చుకోడానికి గడువు గురించి సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. కానీ ఏ విశ్వసనీయ మీడియా సంస్థ కూడా ఇందుకు సంబంధించిన వార్తా నివేదికను కనుగొనలేకపోయాం. ఆర్‌బీఐ అలాంటి నోటిఫికేషన్‌ను జారీ చేసి ఉంటే, మీడియా దానిని తప్పకుండా నివేదించి ఉండేది.
మేము RBI వెబ్‌సైట్‌లో అటువంటి వార్తల కోసం వెతికాము.. అయితే చట్టబద్ధమైన టెండర్, దాని మార్పిడికి సంబంధించి రూ. 100 కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ కనుగొనలేకపోయాం.
న్యూస్‌మీటర్ బృందం ఆర్‌బీఐ ప్రతినిధి యోగేష్ దయాల్‌ను సంప్రదించి వైరల్ సందేశం నకిలీదని ధృవీకరించారు. ఆర్‌బీఐ నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని ఆయన అన్నారు.
2021లో కూడా రూ. 5, 10, 100 పాత నోట్లు మార్చి 2021 తర్వాత చెల్లుబాటు కావని పుకార్లు వచ్చాయి. ఆ సమయంలో PIB ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ లో RBI అటువంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది.
జూలై 19, 2018న, RBI ఒక పత్రికా ప్రకటనలో.. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లోని రూ. 100 డినామినేషన్ బ్యాంక్ నోటు యొక్క కొత్త డిజైన్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ డాక్టర్ ఉర్జిత్ ఆర్.పటేల్ సంతకంతో విడుదల చేసింది. "మునుపటి సిరీస్‌లో రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన రూ. 100 డినామినేషన్‌లోని అన్ని బ్యాంక్ నోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయి" అని కూడా వివరించింది.
కాబట్టి, పాత రూ.100 నోట్లను మార్చుకోడానికి మార్చి 31, 2024 వరకూ గడువు అంటూ వైరల్ అవుతున్న సందేశంలో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam