మొరాకోలో ఇటీవల సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 2,900 దాటిందని, 5,530 మంది గాయపడ్డారని మొరాకో అంతర్గత మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారిని రక్షించే వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియో మొరాకోకు చెందినదని పలువురు చెబుతున్నారు.
ఒక ట్విట్టర్ వినియోగదారు.. వీడియోను పంచుకున్నారు. “Our prayers and support go out to Morocco for their safety.” అంటూ సోషల్ మీడియాలో వ్రాశారు. చిన్న పిల్లాడిని శిథిలాల మధ్య నుండి కాపాడుతూ ఉండడం వీడియోలో మనం గమనించవచ్చు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వీడియో మొరాకోకు సంబంధించినది కాదు. సిరియాకు సంబంధించినది.
వీడియో కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఫిబ్రవరి 12, 2023న ఇరాకీ మీడియా సంస్థ, కుర్దిస్తాన్ TV నివేదికలో అదే వీడియోను మేము కనుగొన్నాము. ఉత్తర సిరియాలో భవనం శిథిలాల నుండి చిన్నారిని రక్షించినట్లు పేర్కొంది.
మేము ఫిబ్రవరి 8, 2023 నాటి ఎక్స్‌ప్రెస్ నివేదికలో “సిరియా భూకంపం శిథిలాల కింద పిల్లవాడు ఏడుస్తున్నాడు” అనే శీర్షికతో మరింత నిడివి ఉన్న వీడియోను కూడా కనుగొన్నాము.
సిరియాలో భూకంపం కారణంగా కుప్పకూలిన భవనం శిథిలాల నుంచి చిన్నారిని రక్షించినట్లు మీడియా పేర్కొంది.
టర్కిష్ వెబ్‌సైట్ నివేదికలో మేము వీడియోను కనుగొన్నాము. ఆ వీడియో సిరియాలోని అలెప్పో ప్రావిన్స్‌లోని ఆఫ్రిన్‌కు చెందినదని పేర్కొన్నారు.
కాబట్టి, వైరల్ వీడియో సిరియాకు సంబంధించినది. మొరాకోకు సంబంధించినది కాదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam