FactCheck : బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డికి బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ప్రత్యేకంగా విషెష్ చెప్పారా?
పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డికి బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Nov 2023 9:00 PM ISTతెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డికి బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"ఎమ్మెల్యే జిఎంఆర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన సినీ నటుడు అర్జున్ కపూర్
రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పటాన్చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి గారు ఘన విజయం సాధించాలని ప్రముఖ సినీ నటుడు అర్జున్ కపూర్ అభిలాషించారు.
ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశం పంపారు.
ప్రజల మనిషిగా పేరొందిన ఎమ్మెల్యే జిఎంఆర్ విజయానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.ఎమ్మెల్యే జిఎంఆర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన సినీ నటుడు అర్జున్ కపూర్
రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పటాన్చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి గారు ఘన విజయం సాధించాలని ప్రముఖ సినీ నటుడు అర్జున్ కపూర్ అభిలాషించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశం పంపారు. ప్రజల మనిషిగా పేరొందిన ఎమ్మెల్యే జిఎంఆర్ విజయానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు." అంటూ సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశారు.
వీడియోలో, అర్జున్ కపూర్.. “హాయ్ మహిపాల్ రెడ్డి, ఇది అర్జున్ కపూర్. నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు జీవితంలో చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాము." అంటూ చెప్పడం వినవచ్చు.
నిజ నిర్ధారణ :
వైరల్ వీడియోను అర్జున్ కపూర్ వీడియో-విషింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ముందే రికార్డ్ చేసిన సందేశమని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము సెర్చ్ చేయగా.. యూట్యూబ్ ఛానెల్ UNAccc న్యూస్‌లో అర్జున్ కపూర్‌కి సంబంధించిన ఇలాంటి వీడియోను మేము కనుగొన్నాము. ఏప్రిల్ 10, 2023న అప్లోడ్ చేసిన వీడియోలో, అర్జున్ కపూర్ అదే వేషధారణలో వేరొక వ్యక్తికి అదే సందేశాన్ని అందజేయడం చూడవచ్చు. వీడియోలో నటుడు unacccnews చైర్మన్ డా. రజత్ శర్మ కు శుభాకాంక్షలు చెప్పారు.
పేరు మినహా మొత్తం సందేశం వైరల్ వీడియో లాగే ఉంది. దీంతో అభిమానులు తమకు ఇష్టమైన సెలబ్రిటీ ద్వారా వారికి నచ్చిన ఇతర వ్యక్తులకు విషెష్ చెప్పించే ప్లాట్ ఫామ్ కు సంబంధించిన వీడియో అని మేము గుర్తించాం.
అర్జున్ కపూర్ అదే బట్టలలో వేర్వేరు వ్యక్తులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి సంబంధించిన పోస్ట్ లు చూశాం. "బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ శివభాయ్ సిలంకి శుభాకాంక్షలు చెప్పారు" అని గుజరాతీ క్యాప్షన్ ను మనం చూడొచ్చు.
దీన్ని క్యూగా తీసుకుని, మేము కీవర్డ్ సెర్చ్ చేసాము. 27 జూన్ 2023న ప్రచురించిన Ferns N Petals యూట్యూబ్ ఛానెల్‌లో ఒరిజినల్ వీడియోను కనుగొన్నాము. వీడియో టైటిల్ లో “అర్జున్ కపూర్ FNP నుండి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు పంపారు ! ఈరోజే FNP వెబ్‌సైట్‌కి వెళ్లడం ద్వారా ఈ సేవను పొందండి.” అని అందులో ఉంది.
వెబ్‌సైట్ ప్రకారం, FNP అనేది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ గిఫ్ట్, బొకే స్టోర్.. ఈ వెబ్ సైట్ ద్వారా అనేక మంది ప్రముఖులు పుట్టినరోజులు, వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పేలా వీడియోను సృష్టిస్తారు.
‘Celebrity video messages’ అనే సెక్షన్ లో ‘Birthday Surprise Personalised Message By Arjun Kapoor’ అని ఉండడాన్ని గుర్తించాం. 599 రూపాయలు కడితే ఎవరికైనా అర్జున్ కపూర్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారని అందులో ఉంది.
మేము ట్రూ ఫ్యాన్ అనే మరొక సారూప్య వెబ్‌సైట్‌ను కూడా కనుగొన్నాము. ఎవరైనా సెలబ్రిటీల నుండి విషెస్ కోరుకునే వారికి వీడియో సందేశాలను ఆర్డర్ చేయవచ్చు. వెబ్‌సైట్‌లో ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది ప్రముఖులతో ఇటువంటి అనేక వీడియోలు ఉన్నాయి.
వైరల్ వీడియోలో అర్జున్ కపూర్ పటాన్‌చెరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డిని ప్రస్తావించారా లేదా అనేది ఇంకా ధృవీకరించబడనప్పటికీ, రాబోయే ఎన్నికల కోసం అర్జున్ కపూర్ మహిపాల్ రెడ్డికి ‘వ్యక్తిగతంగా’ శుభాకాంక్షలు తెలిపినట్లు వీడియోలో చూపించలేదని మేము నిర్ధారించాము. ఇలాంటి వీడియో ఎవరైనా పొందవచ్చు.
Credits : Sunanda Naik