నిజమెంత: 2024 ఉక్రెయిన్ పర్యటనగా ప్రధాని మోదీ పాత అమెరికా పర్యటన వీడియోను షేర్ చేస్తున్నారు

ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Sep 2024 7:45 AM GMT
నిజమెంత: 2024 ఉక్రెయిన్ పర్యటనగా ప్రధాని మోదీ పాత అమెరికా పర్యటన వీడియోను షేర్ చేస్తున్నారు

ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ సమయంలో, ఉక్రెయిన్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించిందని తెలిపే ఓ వీడియో వైరల్‌గా మారింది.

45 సెకన్ల నిడివి గల వీడియోలో, తనకి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి చేరుకున్న ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం చేస్తున్న దృశ్యం, పోలీసు భద్రత కూడా ఫుటేజీలో కనిపిస్తోంది.

ఒక X వినియోగదారు ఈ వీడియోను షేర్ చేసి “ప్రపంచంలో ఏదైనా రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే, మీరు బహిరంగంగా అక్కడికి వెళ్లి మీ మద్దతుదారుల శుభాకాంక్షలను అంగీకరించవచ్చు. కొద్దిరోజుల క్రితం శివసేనకు చెందిన ఓ నాయకుడు మోదీ యుద్ధాన్ని ఆపారా అనే ప్రశ్నను లేవనెత్తారు. చూడండి, మోదీ అక్కడ పర్యటనలో ఉన్నారు, మోడీ కారణంగా యుద్ధం ఆగిపోయింది." (హిందీ నుండి అనువదించబడింది). (ఆర్కైవ్) అంటూ పోస్టు పెట్టారు.

పలు సోషల్ మీడియా ఖాతాలలో ఇలాంటి పోస్టులను షేర్ చేశారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో ఉక్రెయిన్‌లో కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు సంబంధించినది.

రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా యూట్యూబ్‌లో ఇలాంటి వీడియోకు సంబంధించి నిడివి ఎక్కువ ఉన్న వీడియోను మేము కనుగొన్నాం. “న్యూయార్క్ సిటీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది | 2023 జూన్ 20, 2023న ప్రధాని మోదీ అమెరికా పర్యటన." అంటూ వీడియోను పోస్టు చేశారు.

జూన్ 20, 2023న “న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న PM @narendramodi గారికి ఘన స్వాగతం” అనే శీర్షికతో ఇదే విధమైన వీడియోని కలిగి ఉన్న BJP అధికారిక ఖాతా లోని X పోస్ట్‌ను కూడా మేము కనుగొన్నాము. #ModiInUSA అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా ఉపయోగించారు.

అదే రోజు ఇండియా టుడే చేసిన వీడియో నివేదికలో “Modi US Visit 2023: PM Modi Receives Grand Welcome As He Lands In New York For 3-day US Visit,”అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియో మోదీ యుఎస్ పర్యటనకు సంబంధించినదని ధృవీకరించింది.

2023 జూన్ 20, మంగళవారం నాడు నరేంద్ర మోదీ 3 రోజుల యునైటెడ్ స్టేట్స్ పర్యటన కోసం న్యూయార్క్ చేరుకున్నారని నివేదిక పేర్కొంది.

ఉక్రెయిన్‌లోని విమానాశ్రయాలు కొంతకాలంగా మూసివేశారు. మేము PM మోదీ ఉక్రెయిన్ పర్యటనకు సంబంధించి కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము.

DD News అధికారిక యూట్యూబ్ ఛానెల్ ఆగస్టు 23, 2024న పోస్ట్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము, “PM Modi తన ఒకరోజు ఉక్రెయిన్ పర్యటనను ప్రారంభించడానికి పోలాండ్ నుండి కైవ్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.” అని అందులో ఉంది.

రైల్వే స్టేషన్‌కు ప్రధాని మోదీ రాకను వీడియో చూపించింది. ఉక్రెయిన్‌కు భారత ప్రధాని చేసిన మొదటి పర్యటన ఇదే అని పేర్కొన్నారు. అదే వీడియోను PMO ఇండియా యూట్యూబ్ ఛానెల్ అదే రోజున “ప్రధాని నరేంద్ర మోదీ రైలులో కైవ్‌కు చేరుకున్నారు” అనే శీర్షికతో భాగస్వామ్యం చేశారు.

యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్‌లోని విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించిందన్న వాదన అవాస్తవం. వీడియో 2023లో అమెరికా పర్యటనకు సంబంధించినది. ప్రధానమంత్రి ఆగస్టు 23, 2024న ఉక్రెయిన్ చేరుకున్నారు. అయితే ఆయన పోలాండ్ నుంచి రైలులో ప్రయాణించారు.

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim Review:నిజమెంత: 2024 ఉక్రెయిన్ పర్యటనగా ప్రధాని మోదీ పాత అమెరికా పర్యటన వీడియోను షేర్ చేస్తున్నారు
Claimed By:Social media user
Claim Reviewed By:NewsMeter
Claim Source:X Users
Claim Fact Check:False
Next Story