Fact Check : ఉత్తరప్రదేశ్ లోని ఆసుపత్రిలో గోవు సంచరిస్తూ కనిపించిందా..?

Video of cow walking in Hospital Ward. ఓ ఆసుపత్రిలో ఆవు సంచరిస్తూ ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Jun 2021 8:30 PM IST
Fact Check : ఉత్తరప్రదేశ్ లోని ఆసుపత్రిలో గోవు సంచరిస్తూ కనిపించిందా..?

ఓ ఆసుపత్రిలో ఆవు సంచరిస్తూ ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుందని పలువురు వీడియోను షేర్ చేశారు.


https://www.facebook.com/Bjpthondargal/videos/763881224327941

'ఉత్తరప్రదేశ్ మినిస్టర్ కరోనా వార్డును సందర్శించారు' అంటూ పోస్టులు పెట్టడం కూడా గమనించవచ్చు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఇలా నెటిజన్లు పోస్టులు పెట్టారు.

నిజ నిర్ధారణ:

ఉత్తరప్రదేశ్ లోని ఆసుపత్రిలో గోవు తిరుగుతూ ఉందంటూ వైరల్ అవుతున్న పోస్టులు 'ప్రజలను తప్పుద్రోవ పట్టించడానికి చేసినవే'.

వైరల్ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని సెర్చ్ చేయగా.. ఈ వీడియోకు ఉత్తరప్రదేశ్ కు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఈ వీడియో కెన్యాకు సంబంధించినది.

tuko.co.ke కథనం ప్రకారం కెన్యాకు చెందిన డాక్టర్ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆవు ఆసుపత్రిలోని వార్డుల్లో తిరగడాన్ని గమనించవచ్చు.

Aproko Doctor అనే అకౌంట్ లో వీడియోను అప్లోడ్ చేయడం జరిగింది. చాలా వరకూ బెడ్స్ ఖాళీగానే ఉన్నాయి. ఓ వ్యక్తి మాత్రం ఆ ఆవును కదిలించాడు. అప్పుడు ఆ ఆవు బయటకు వెళ్ళిపోయింది.

ఆయన ప్రొఫైల్ ఆధారంగా మెడికల్ బ్లాగ్ ను కూడా మైంటైన్ చేస్తున్నాడని.. వైద్యానికి సంబంధించిన పలు విషయాలను తెలియజేస్తూ ఉన్నాడని స్పష్టమవుతోంది.

https://aprokodoctor.com/blog/

కెన్యాలో ఏ ప్రాంతంలో చోటు చేసుకుందనే పూర్తీ సమాచారం లేకపోయినప్పటికీ.. ఈ ఘటన భారత్ లో చోటు చేసుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా యూపీకి చెందిన ఆసుపత్రి కూడా కాదని అర్థమవుతూ ఉంది.

యూపీలోని ఆసుపత్రిలో ఆవు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఘటన కెన్యాలో చోటు చేసుకుంది.




Claim Review:ఉత్తరప్రదేశ్ లోని ఆసుపత్రిలో గోవు సంచరిస్తూ కనిపించిందా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:False
Next Story