ఒక వ్యక్తి కత్తిని చూపుతూ బెదిరిస్తూ ఉండగా.. పోలీసులు కాల్పులు జరుపుతున్న వీడియో ఉత్తరప్రదేశ్‌కు చెందినది అనే వాదనతో షేర్ చేస్తున్నారు.
ఓ ట్విటర్ యూజర్ వీడియోను షేర్ చేస్తూ, “ఉత్తరప్రదేశ్‌లోని యోగి పాలనలో అబ్దుల్ అనే వ్యక్తి మార్కెట్‌లో బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు” అని రాశారు.
ఇదే విషయాన్ని పేర్కొంటూ పలువురు ఫేస్‌బుక్ వినియోగదారులు వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
ఈ వీడియో కర్ణాటకలోని కలబుర్గీకి చెందినదని న్యూస్‌మీటర్ కనుగొంది.
వీడియో కీఫ్రేమ్ లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ది న్యూస్ మినిట్ ట్వీట్ చేసిన వీడియోలో ఎక్కువ నిడివి ఉన్న వీడియోను మేము కనుగొన్నాము. ఆ ట్వీట్‌లో “కత్తిని చూపుతున్న వ్యక్తిపై కర్నాటక పోలీసులు కాల్పులు జరిపారు” అని రాసి ఉంది.
న్యూస్ మినిట్ కూడా ఫిబ్రవరి 6న యూట్యూబ్‌లో వీడియోను అప్లోడ్ చేసింది.
ఫిబ్రవరి 5న కలబురగి పోలీసులు కత్తితో ఓ వ్యక్తిని కాల్చారు. రద్దీగా ఉండే మార్కెట్‌లో నిందితుడు ప్రజలను బెదిరిస్తున్నాడు. అతడిని అరెస్టు చేసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఫిబ్రవరి 6న, హిందూస్తాన్ టైమ్స్ ఈ సంఘటనను నివేదించింది. వీడియోకు సంబంధించిన ఒక స్టిల్‌ను ప్రచురించింది. కత్తితో ప్రజలను బెదిరిస్తున్న వ్యక్తిని మహ్మద్ ఫజల్ జాఫర్ (28)గా పోలీసులు గుర్తించినట్లు అందులో పేర్కొన్నారు. కలబురగి పోలీసులు అతనిపై కాల్పులు జరిపారని, ఆ తర్వాత అరెస్టు చేసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారని కూడా పేర్కొంది.
కర్ణాటకలోని కలబురగిలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసు అధికారి న్యూస్‌మీటర్‌తో మాట్లాడి ధృవీకరించారు. నిందితుడి పేరు మహ్మద్ ఫజల్ జాఫర్ అని, అతను ఇంకా ఆసుపత్రిలో ఉన్నాడని చెప్పారు.
వైరల్ వీడియో కర్ణాటకలోని కలబుర్గికి చెందినదని, ఆ వీడియో ఉత్తరప్రదేశ్‌కు చెందినదనే వాదన తప్పు అని మేము నిర్ధారించాము.