Fact Check : దాడి చేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల మీద తిరగబడ్డ ఒక వ్యక్తి.. ఈ ఘటన ఫ్రాన్స్ లో చోటుచేసుకుందా..?

Video of brawl in Brazil. తన మీద దాడి చేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను ఓ వ్యక్తి చితక్కొడుతున్న వీడియో సామాజిక

By Medi Samrat  Published on  17 Nov 2020 3:40 AM GMT
Fact Check : దాడి చేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల మీద తిరగబడ్డ ఒక వ్యక్తి.. ఈ ఘటన ఫ్రాన్స్ లో చోటుచేసుకుందా..?

తన మీద దాడి చేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను ఓ వ్యక్తి చితక్కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఫ్రాన్స్ లో ముస్లింల మీద చోటు చేసుకున్న ఘటన ఇదని.. ఇద్దరు వ్యక్తులు కొట్టడానికి వస్తే తిరగబడి.. చితక్కొట్టాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ ఘటన ఫ్రాన్స్ లో చోటు చేసుకుందని షేర్ చేస్తూ ఉన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని యూట్యూబ్ లో కూడా పోస్టు చేశారు. కువైట్ లో ఈజిప్టు కు చెందిన వ్యక్తి మీద దాడి చేయడానికి ప్రయత్నించగా.. అతడు తిరగబడిన వీడియో అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు.


"Two French men attacked a Muslim in France, thinking he is alone and will be unable to fight back. Watch the video to know how the Muslim man fought back". అంటూ పలువురు ఫేస్ బుక్ లోనూ, బ్లాగుల్లోనూ వీడియో పోస్టు చేశారు.

నిజ నిర్ధారణ:

ఓ ముస్లిం వ్యక్తి మీద దాడి చేయడానికి వచ్చిన ఫ్రెంచ్ వ్యక్తులు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

ఈ ఘటనపై న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా newsreport లో ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. ఈ ఘటనకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా చూడొచ్చు. ఈ కథనం ప్రకారం ఈ ఘటన అక్టోబర్ 12న చోటు చేసుకుంది. నలుపు రంగు వెస్ట్ ను ధరించిన వ్యక్తిని రఫెల్ జూనియర్ ద కోస్టా వియెర్రాగా గుర్తించారు. అతడిని జాకీ చాన్ అని కూడా అంటారట. హత్యానేరారోపణ కింద అతడిని అరెస్టు కూడా చేశారు. ఈ ఘటన బ్రెజిల్ లో చోటు చేసుకుంది.

Estado DeMinas అనే బ్రెజిలియన్ న్యూస్ పేపర్ లో ఈ ఘటనకు సంబంధించిన కథనాన్ని చూడొచ్చు. బ్రెజిల్ లోని మినాస్ గెరియాస్ సెంట్రల్ రీజియన్ లోని ఔరో బ్రాంకో రెస్టారెంట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

బ్రెజిల్ కు చెందిన న్యూస్ పోర్టల్ లో ఈ ఘటనకు సంబంధించి ఎక్కువ నిడివి ఉన్న వీడియోను గమనించవచ్చు. వియెర్రా ఆ వ్యక్తి మీద గన్ ను గురిపెట్టడం రికార్డు అయ్యింది.


బ్రెజిల్ లో చోటు చేసుకున్న ఘటనను ఫ్రాన్స్ లో చోటు చేసుకున్న ఘటనగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.


Next Story