Fact Check : రుద్రాక్ష ధరించినందుకు హిందూ కుర్రాడిని టీచర్ చితకబాదాడా..?

Video of a Teacher Thrashing a Student Shared With a Communal Twist. ఓ పిల్లాడిని టీచర్ చితక్కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2021 3:23 PM IST
Fact Check : రుద్రాక్ష ధరించినందుకు హిందూ కుర్రాడిని టీచర్ చితకబాదాడా..?

ఓ పిల్లాడిని టీచర్ చితక్కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఓ పిల్లాడు రుద్రాక్ష వేసుకుని స్కూల్ కు వచ్చాడనే కారణంతో తమిళనాడుకు చెందిన టీచర్ పిల్లాడిని విచక్షణారహితంగా కొట్టాడని పోస్టులు పెడుతూ ఉన్నారు.


సుదర్శన్ న్యూస్ చీఫ్ ఎడిటర్ సురేష్ చావాంకే ఈ వీడియోను ట్వీట్ చేసి.. హెడ్‌మాస్టర్ క్రిస్టియన్ అని విద్యార్థి రుద్రాక్ష ధరించడంతో కొడుతున్నాడని పేర్కొంటూ వీడియోను పంచుకున్నారు.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

న్యూస్ మీటర్ వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా The Hindu లో ఓ కథనం కనిపించింది. అక్టోబర్ 5, 2021న "Teacher held for kicking Dalit boy in classroom" అంటూ ఓ కథనాన్ని ప్రసారం చేసింది.

చిదంబరం టౌన్ పోలీసులు ఆ టీచర్ ను అదుపులోకి తీసుకున్నారు. దళిత వర్గానికి చెందిన 12 వ తరగతి విద్యార్థిని కొట్టినందుకు నందానర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిని చిదంబరం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల ప్రకారం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుగనాథన్ బుధవారం పాఠశాలలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పిల్లాడు తరగతులకు హాజరుకావడం లేదని కనుగొన్నాడు. తరగతి గదికి తీసుకెళ్లి ఉపాధ్యాయుడు సుబ్రమణియన్‌కి ఫిర్యాదు చేశాడు. ఉపాధ్యాయుడు విద్యార్థిని విచారించాడు. సుబ్రమణియన్‌ విద్యార్థి జుట్టు పట్టుకుని కొట్టడం ప్రారంభించాడు. కొట్టి, తన్నడంతో ఈ ఘటనను కొంతమంది విద్యార్థులు తమ మొబైల్ ఫోన్‌లతో వీడియో తీసి.. ఆ తర్వాత సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.

Bharat Times, Indien News, Justice News వంటి మీడియా సంస్థలు కూడా ఈ ఘటనపై కథనాలను రాశాయి.

ఈ ఘటనలో ఎలాంటి కమ్యూనల్ యాంగిల్ లేదని పోలీసులు ధృవీకరించారు. వైరల్ పోస్టు ప్రజలను తప్పుద్రోవ పట్టించేదని స్పష్టం చేశారు. వైరల్ పోస్ట్‌ను తొలగించిన పోలీసు అధికారులు పలు విషయాలను తెలిపారని న్యూస్ మినిట్ మీడియా సంస్థ తెలిపింది. చిదంబరంలోని డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ మాట్లాడుతూ "తన తరగతులకు రానందుకు ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టాడు. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత, ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. SC/ST చట్టం మరియు IPC యొక్క సంబంధిత విభాగాల కింద కేసు నమోదు చేశారు.. ఇందులో మత కోణం లేదు. " అని స్పష్టం చేశారు.

విద్యార్థి క్లాసులకు హాజరుకాని కారణంగా మాత్రమే కొట్టాడని హెడ్ మాస్టర్ కూడా తెలిపారు.

"ఎనిమిది మంది విద్యార్థులు బుధవారం పాఠశాలకు వచ్చారు మరియు మొదటి గంటకు హాజరయ్యారు. కానీ రెండవ గంటలో ఫిజిక్స్ క్లాస్ మరియు సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు రోజువారీ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నందున.. ఈ ఎనిమిది మంది విద్యార్థులు క్లాస్‌ నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు" అని హెడ్‌మాస్టర్ చెప్పారు.

వైరల్ పోస్ట్ ద్వారా చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియోను మతపరమైన కోణంతో షేర్ చేయడంలో ఎటువంటి నిజం లేదు.


Claim Review:రుద్రాక్ష ధరించినందుకు హిందూ కుర్రాడిని టీచర్ చితకబాదాడా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter Users
Claim Fact Check:False
Next Story