ఉత్తరప్రదేశ్ పోలీసులు 30 రోజుల మాస్క్ చెకింగ్ ప్రోగ్రాంను ప్రారంభించబోతున్నారని వాట్సాప్‌లో ఒక సందేశం విస్తృతంగా షేర్ చేయబడుతోంది.
మాస్క్ లేకుండా పట్టుబడిన వారికి 10 గంటల పాటు జైలు శిక్ష విధిస్తామని వినియోగదారులు చెబుతూ ఉన్నారు.
ఇందుకు సంబంధించి న్యూస్‌మీటర్‌కి వాట్సాప్‌లో ఈ సందేశం వచ్చింది.
"రేపు ఉదయం 9 గంటలకు, ఉత్తరప్రదేశ్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 30 రోజుల మాస్క్ చెకింగ్ నిర్వహించబడుతుంది. ఉత్తరప్రదేశ్ పోలీసులచే ప్రజా ప్రయోజనాల కోసం జారీ చేయబడింది." అంటూ పోస్టు వైరల్ అవుతూ ఉంది.
ఇలాంటిదే ట్విట్టర్ లో కూడా వైరల్ అవుతూ ఉంది.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
NewsMeter కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించడం ద్వారా పరిశోధనను ప్రారంభించింది. ఇది ఫిబ్రవరి 2021లో Twitterలో ఉన్న అనేక సారూప్య పోస్ట్‌లకు దారితీసింది.
UP పోలీసుల ఫ్యాక్ట్ చెకింగ్ ట్విట్టర్ హ్యాండిల్‌లో.. మేము జనవరి 08, 2022న వైరల్ పోస్ట్‌ను ఖండిస్తూ ఒక పోస్ట్‌ని కనుగొన్నాము. పోలీసులు అలాంటి నిర్ణయం ఏదీ జారీ చేయలేదని చెబుతున్నాము. అయితే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలని సూచించారు. మాస్క్ వేసుకోవడం అనే చర్యల అమలు 30 రోజులు మాత్రమే కాకుండా కోవిడ్ వ్యాప్తి కొనసాగే వరకు ఉంటుంది. మాస్క్ ధరించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తాత్కాలిక జైలు శిక్ష విధించే నిబంధన లేదని యూపీ పోలీసులు తెలిపారు.
ఫిబ్రవరి 26, 2021న హిందూస్తాన్ టైమ్స్ మరియు నవభారత్ టైమ్స్ ప్రచురించిన నివేదికను బృందం కనుగొంది. UP పోలీసులు ఈ వాదనను తిరస్కరించారని.. అలాంటి తాత్కాలిక జైలు శిక్ష లేదని నివేదికలు పేర్కొన్నాయి.
కాబట్టి వైరల్ సందేశం బూటకమని స్పష్టమైంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు మాస్క్ ధరించని వ్యక్తులను జైలులో పెట్టడం లేదు.