కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ హిందూ మతానికి చెందిన స్వామీజీ చేత శాలువా కప్పుకుంటూ ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. నఖ్వీ హిందూ మతంలోకి మారినట్లు ప్రచారం చేస్తున్నారు.
ఫేస్‌బుక్ వినియోగదారులు కొందరు వీడియోను షేర్ చేసి, "ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తన మతాన్ని మార్చుకున్నాడు" అని రాశాడు. "Mukhtar Abbas Naqvi changed his religion." అంటూ పోస్టులు పెట్టారు.
నిజనిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
న్యూస్ మీటర్ వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్‌లను సేకరించింది. గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. సెప్టెంబర్ 21 న కేంద్ర మంత్రి ఫేస్‌బుక్‌లో వీడియోను అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము, "ఈరోజు న్యూఢిల్లీలోని అంత్యోదయ భవన్‌లో విశాఖ శారదాపీఠానికి చెందిన గౌరవనీయులైన శ్రీ శ్రీ శ్రీ స్వాత్మనందేంద్ర సరస్వతి మహాస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అక్టోబర్ 7 నుండి 15 వరకు నిర్వహించబోతున్న శ్రీ శారద స్వరూప రాజశ్యామల శరన్నవరాత్రి మహోత్సవానికి నన్ను స్వామీజీ ఆహ్వానించారు" అని వెల్లడించారు.
ఇవే ఫోటోలను ట్విట్టర్ లో కూడా ఆయన షేర్ చేశారు.
"విశాఖ శ్రీ శారదా పీఠం" కోసం గూగుల్ లో సెర్చ్ చేయగా vssp.com వెబ్‌సైట్‌కి దారితీసింది. అక్కడ స్వామి స్వాత్మనందేంద్ర సరస్వతి యొక్క అనేక వీడియోలు మరియు ఫోటోలు కనిపిస్తాయి.
శ్రీ శారద స్వరూప రాజశ్యామల శరన్నవరాత్రి మహోత్సవానికి ఆహ్వానం పలకడం కోసం వివిధ ప్రముఖులను ఆహ్వానించడం వంటి అనేక చిత్రాలను వెబ్ సైట్ లో మనం చూడవచ్చు. అక్టోబర్ 7 నుండి 15 వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. స్వయంగా వెళ్లి పలువురు ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది.
అందువల్ల, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ హిందూ మతంలోకి మారారనే వాదన తప్పు. విశాఖ శారదా పీఠం నుండి స్వామి స్వామానందేంద్ర సరస్వతి నఖ్వీ ఆఫీసును సందర్శించిన సమయంలో వీడియో తీయబడింది. ఇది ఒక తప్పుడు కథనంతో ప్రచారం చేయబడుతోంది.