Fact Check : వెళుతూ.. వెళుతూ ట్రంప్ బైడెన్ కు ఆ లేఖలు రాశాడా..?

Trump's letter to Biden circulating on social media are fake. అమెరికా 46వ ప్రెసిడెంట్ గా జో బైడెన్ ప్రమాణస్వీకారం జనవరి

By Medi Samrat  Published on  23 Jan 2021 7:00 PM IST
Fact Check : వెళుతూ.. వెళుతూ ట్రంప్ బైడెన్ కు ఆ లేఖలు రాశాడా..?

అమెరికా 46వ ప్రెసిడెంట్ గా జో బైడెన్ ప్రమాణస్వీకారం జనవరి 20న చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ బైడెన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తన కుటుంబానికి చెందిన 127 ఏళ్ల నాటి బైబిల్‌పై బైడెన్ ప్రమాణం చేశారు. 78 ఏళ్ల వయసులో జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు. అమెరికా చరిత్రలోనే అత్యంత పెద్ద వయసులో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా జో బైడెన్ స‌రికొత్త రికార్డు సృష్టించారు. ప్రమాణ స్వీకారం అనంతరం జో బైడెన్ మాట్లాడుతూ.. అమెరికాలో కొత్త చరిత్ర ప్రారంభమైందని అన్నారు. ఇది అమెరికా ప్రజలందరి విజయమని చెప్పారు.



ఈ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ కావాలనే దూరమయ్యారు. అయితే వెళుతూ వెళుతూ కొన్ని లెటర్లను బైడెన్ కోసం వదిలి వెళ్ళాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలుస్తూ ఉన్నాయి.

"Joe, you know I won." (జో.. నీకు తెలుసు నేను గెలిచానని) అన్నది ఆ లెటర్ లో ఉంది.

"Dear Joe, Can I get a pardon? Thanks." అంటూ ఇంకో లెటర్ కూడా వైరల్ అవుతూ కనిపించింది.

Archive links: https://web.archive.org/save/https://twitter.com/DoctorSpac/status/1352006327350960128

https://web.archive.org/save/https://twitter.com/NYinLA2121/status/1351994253543501830

నిజ నిర్ధారణ:

ట్రంప్ వెళుతూ వెళుతూ బైడెన్ కోసం రాసిన లెటర్లు అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ లెటర్లు బైడెన్ కు డొనాల్డ్ ట్రంప్ రాయలేదు.

ట్రంప్ బైడెన్ కోసం ఓ లెటర్ ను వదిలిపెట్టి వెళ్లిన సంగతి నిజమే.. అయితే ఆ లెటర్ లో ఏమి ఉందో మాత్రం వివరాలు బయటకు రాలేదు. వైట్ హౌస్ కూడా ఎటువంటి ప్రకటనను చేయలేదు.

ఆసక్తికరమైన లెటర్ ఒకటిని బైడెన్ కోసం ట్రంప్ వదిలిపెట్టి వెళ్లాడని మీడియాలో వార్తలు వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా అమెరికా ప్రెసిడెంట్లకు ఈ లెటర్ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. మొదట ఈ లెటర్ ను ట్రంప్ ఇవ్వరేమోనని భావించారు.. కానీ ఆఖరి నిమిషంలో ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బైడెన్ కూడా ధృవీకరించారు.. ఈ లెటర్ లో ఏముందో అనే విషయాన్ని మాత్రం ఆయన కూడా బయటపెట్టలేదు.

మీడియా సంస్థలు కూడా ట్రంప్ బైడెన్ కు రాసిన లెటర్ చాలా ప్రైవేట్ అని చెప్పుకొచ్చారు.

https://www.usatoday.com/story/news/politics/elections/2021/01/20/biden-inauguration-traditions-trumps-didnt-do/4223098001/



వైరల్ అవుతున్న ఫోటోలు ఫోటో షాప్ చేసినవే కాకుండా.. డొనాల్డ్ ట్రంప్ ను ట్రోల్ చేయడానికి రూపొందించినవి. అంతేకానీ నిజంగా ట్రంప్ రాసిన లేఖలు కావు. వైరల్ అవుతున్న పోస్టులు పచ్చి అబద్ధం.


Claim Review:వెళుతూ.. వెళుతూ ట్రంప్ బైడెన్ కు ఆ లేఖలు రాశాడా..?
Claimed By:Twitter Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter
Claim Fact Check:False
Next Story