కరెన్సీ నోట్లతో అలంకరించిన ఆలయ వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు. ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయమని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతూ ఉన్నారు.
వీడియోకు ఉన్న హిందీ క్యాప్షన్ ను అనువదించగా.. "పువ్వులకు బదులుగా భారతీయ కరెన్సీ నోట్లతో ప్రత్యేకమైన అలంకరణ ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి బాలాజీ ఆలయం" అని ఉంది.
https://www.facebook.com/100008462229113/posts/pfbid02UiysnCknGvFmsvMvA8d78sozqH2jVk1xZKaicu5rrVa2iR3en68wZjAhgTcfGMQCl/
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎలాంటి నిజం లేదు'.
NewsMeter రివర్స్ ఇమేజ్ సెర్చ్, కీవర్డ్ సెర్చ్‌ని నిర్వహించింది, ఇది YouTubeలో ఇలాంటి విజువల్స్‌కు దారితీసింది. వీడియో టైటిల్ "Sri Kanyaka Parameswari temple decorated with currency notes| Nellore | Dussehra 2021 | SumanTv." అని ఉంది.
శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక అలంకరణ గురించి కొన్ని వార్తా కథనాలను కూడా మేము కనుగొన్నాము. నివేదికల ప్రకారం, దసరా ఉత్సవాల సందర్భంగా (2021), ఆలయ కమిటీ దేవతను ₹5.16 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించింది.
ఇలాంటి ఇతర వీడియోలు అక్టోబర్ 2021న YouTubeలో అప్‌లోడ్ చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులోని కన్యకా పరమేశ్వరి ఆలయానికి చెందినవిగా గుర్తించాం.
https://www.google.com/maps/uv?pb=!1s0x3a4c8da9a6b53c53%3A0xa090888fbfc2129c!3m1!7e115!4shttps%3A%2F%2Flh5.googleusercontent.com%2Fp%2FAF1QipOJvnpd6PSHa6c714NwxBhLF8RuRa3lBDTkeCd0%3Dw120-h160-k-no!5ssri%20kanyaka%20parameswari%20temple%20nellore%20-%20Google%20Search!15sCgIgAQ&imagekey=!1e10!2sAF1QipPLMlMpZ-Cr-GjeY6ttH_HwzbOO7oUQMQxwWISu&hl=en&sa=X&ved=2ahUKEwi384bF8tT4AhU6SmwGHRDFDvkQoip6BAgqEAM&viewerState=ga
ఇదే విషయాన్ని మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి.
తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కరెన్సీ నోట్లతో అలంకరించడంపై మీడియాలో ఎలాంటి కథనాలు కనిపించలేదు.
https://www.newindianexpress.com/states/andhra-pradesh/2021/oct/12/andhras-nellore-temple-deitydecorated-with-currency-notes-worth-rs-5-crore-2370598.html
https://odishatv.in/news/national/andhra-temple-decorated-with-rs-5-crore-currency-notes-161664
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.