FactCheck : సోనూ సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారా..?

Sonu Sood Has not Joined Congress Viral Claims are False. నటుడు సోనూసూద్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Jan 2022 2:01 PM GMT
FactCheck : సోనూ సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారా..?

నటుడు సోనూసూద్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విస్తృతంగా షేర్ అవుతోంది. ఆ పోస్ట్‌లో 'సోనూ సూద్ ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు' అని రాసి ఉంది.

పలువురు కాంగ్రెస్ ప్రముఖులతో సోనూ సూద్ ఉన్న ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి.

నిజ నిర్ధారణ :

ఈ వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

NewsMeter తన పరిశోధనను కీవర్డ్స్ ద్వారా మొదలు పెట్టగా.. జనవరి 10, 2022న ANI చేసిన ట్వీట్‌కు దారితీసింది. కీవర్డ్ సెర్చ్ లో కీలక విషయాలు తెలిశాయి.

మొదటి ట్వీట్‌లో ఏఎన్ఐ వార్తా సంస్థ రెండు చిత్రాల సెట్‌ను పంచుకుంది.. నటుడు సోనూ సూద్ అతని సోదరి మాళవికా సూద్, పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూతో కలిసి కనిపించారు. "పంజాబ్: రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మోగాలోని తన నివాసంలో నటుడు సోనూసూద్ మరియు అతని సోదరిని కలిశారు" అని ట్వీట్ ఉంది. "Punjab: State Congress chief Navjot Singh Sidhu meets actor Sonu Sood and his sister at his residence in Moga."

తరువాత ట్వీట్‌లో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాళవికా సూద్‌ను పార్టీలోకి స్వాగతించారు.

జనవరి 10, 2022న జీ న్యూస్ హిందీ ప్రచురించిన నివేదికను మా బృందం కనుగొంది.

'బాలీవుడ్ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె సోమవారం పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీల సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ సోనూసూద్ కరోనా కాలంలో మానవత్వం చాటుతూ అద్వితీయమైన పని చేశారని అన్నారు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు మాతో చేరుతున్నారు" అని అందులో ఉంది.

మా బృందం జనవరి 10, 2022న పంజాబ్ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చేసిన మరో ట్వీట్‌ను కనుగొంది.

"We welcome Ms. Malvika Sood Sachar to the Congress family who joined the party today, supported by her brother, actor & social worker @SonuSood, in the presence of CM @CHARANJITCHANNI & PPCC President S. Navjot Singh Sidhu. We wish her all the best in her journey in service of people,"అని ట్వీట్‌లో ఉంది.

తన సోదరి మాళవికా సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరడం గురించి సోనూ సూద్ తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకున్నాడు.

"నా సోదరి మాళవిక సూద్ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించినందున, నేను ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమె జీవితంలోని ఈ కొత్త అధ్యాయం కోసం వేచి చూస్తున్నాను. మాళవికకు శుభాకాంక్షలు. నటుడిగా మానవతావాదిగా నా స్వంత పని కొనసాగుతుంది" అని అతని పోస్ట్‌ లో ఉంది.

ప్రధాన స్రవంతి మీడియాలో సోనూ సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పేర్కొన్న నివేదికలు ఏవీ లేవు.

మా బృందం సోనూ సూద్ సహచరుడినిసంప్రదించింది. నటుడు సోనూసూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారనే వాదనను తోసిపుచ్చారు. ఇది తప్పుడు వార్త అని.. సోషల్ మీడియా వినియోగదారులందరూ అలాంటి పోస్ట్‌లను షేర్ చేయవద్దని కోరారు. పార్టీలో చేరింది సోనూ సూద్ కాదు .. ఆయన సోదరి అని వివరణ ఇచ్చారు.

అందువల్ల దావా తప్పు అని స్పష్టమైంది. సోనూసూద్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు.


Claim Review:సోనూ సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story