కాశ్మీరీ యువకుడు అచ్చం షారుఖ్ ఖాన్ లాగే ఉన్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. "Kashmiri boy who likes like Bollywood Badshah @iamsrk" అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. షారుఖ్ ఖాన్ ను కూడా యూజర్లు ట్యాగ్ చేస్తూ ఉన్నారు.
చాలా వెబ్ సైట్లలో ఈ ఫోటోను పబ్లిష్ కూడా చేశారు.
https://pristinekashmir.in/news/kashmir/kashmiri-boy-on-social-media-who-looks-like-shahrukh-khan
https://www.kashmirpen.com/kashmiri-boy-on-social-media-who-looks-like-shahrukh-khan/
Archive links: https://web.archive.org/save/
https://twitter.com/AabidMagami/status/1338157151789883393
నిజ నిర్ధారణ:
కాశ్మీర్ కు చెందిన యువకుడు అచ్చం షారుఖ్ ఖాన్ లాగే ఉన్నాడంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
ఫేస్ బుక్, ట్విట్టర్ లోని కామెంట్స్ ప్రకారం కొందరు బేబీ ఫిల్టర్లు, బేబీ యాప్స్ కోసం సెర్చ్ చేసి వెతకగా.. ముఖాన్ని చిన్న పిల్లల లాగా చేసే యాప్స్ ఎన్నో ఉన్నాయి.
ఫేస్ యాప్ ఇలా వర్క్ చేస్తుంది అంటూ పలువురు కామెంట్లు చేయడం గమనించవచ్చు.
గూగుల్ ప్లే స్టోర్ లో ఫేస్ యాప్ కు చెందిన సమాచారంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ముఖాన్ని చాలా మార్చవచ్చని చిన్న పిల్లలిగా కూడా చేయవచ్చని తెలిపారు. ఎన్నో ఎడిట్స్ చేసుకోవచ్చు. ఎన్నో రకాలుగా ఫోటోలను మార్పు చేసుకోవచ్చు. ఇప్పటి దాకా 500 మిలియన్ల డౌన్లోడ్స్ చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=io.faceapp&hl=en_IN&gl=US
న్యూస్ మీటర్ కూడా ఫేస్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని షారుఖ్ ఖాన్ ఫోటోను అందులో చెక్ చేయగా.. ఇదే రిజల్ట్స్ వచ్చాయి. వైరల్ అవుతున్న ముఖమే షారుఖ్ ఖాన్ ఫోటోను ఫేస్ యాప్ ద్వారా సెర్చ్ చేస్తే వస్తోంది.
ఎంతో మంది సెలెబ్రిటీలకు సంబంధించి ఇలా ఫేస్ యాప్ ద్వారా మార్పు చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ఇలా వైరల్ అవుతూ ఉన్నాయి.
వైరల్ అవుతున్న ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫేస్ యాప్ నుండి తయారు చేసినది. ఆ ఫోటోలో ఉన్నది కాశ్మీరీ యువకుడు కానే కాదు. వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'.