ఇటీవల మరణించిన క్వీన్ ఎలిజబెత్ II కు కార్గీ జాతికి చెందిన కుక్కలంటే ఎంతో ఇష్టం. క్వీన్ ఎలిజబెత్ II చనిపోయాక ఆమెతో పాటు ఆ కుక్కలను కూడా సజీవంగా పాతిపెడతారంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెప్టెంబరు 8న 96 ఏళ్ల వయసులో మరణించిన ఎలిజబెత్ II ను సెప్టెంబర్ 19న ఖననం చేశారు.
ఆమె మరణించినప్పుడు.. ఆమె ఇష్టంగా పెంచుకున్న కుక్కలు కూడా ఆమెతో పాటూ సజీవంగా ఖననం చేశారనే పుకార్లు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. మేము"Cute! Queen Elizabeth's Corgis Prepare to Be Buried Alive With Her." అనే శీర్షికతో ఒక కథనాన్ని కనుగొన్నాము.
"Kurt Zouma kicked a cat and the whole England went crazy. Now Elizabeth's dog will be buried alive with her. Where are the animal activists???" అంటూ పలు పోస్టులు వైరల్ అయ్యాయి.
నిజ నిర్ధారణ :
క్వీన్ ఎలిజబెత్ II ఆమె జీవితకాలంలో 30 కంటే ఎక్కువ కుక్కలను పెంచారని.. ఎంతో ప్రేమగా ఆ కుక్కలను చూసుకుంటూ ఉండేవారని చెబుతూ ఉండేవారు.
కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించినప్పుడు, మేము కుక్కలకు సంబంధించిన కుటుంబ వృక్షాన్ని చూపుతున్న BBC నివేదికను కనుగొన్నాము.
క్వీన్ ఎలిజబెత్ II చనిపోయే సమయంలో ఆమె దగ్గర నాలుగు కుక్కలు ఉన్నాయి. అందులో రెండు కార్గీ జాతికి చెందిన కుక్కలు కాగా.. ఒకటి కాకర్ స్పానియల్.. మరొకటి డార్గీ.
క్వీన్ ఎలిజబెత్‌తో పాటు కార్గిస్‌ను సజీవంగా పాతిపెట్టారా? అని అడిగితే మాత్రం సమాధానం, లేదనే వస్తుంది!
క్వీన్ ఎలిజబెత్ IIకి సంబంధించిన వార్త ఏదైనా వైరల్ అవుతుంది. క్లెయిమ్ వాస్తవికతను సమర్థించే మీడియా నివేదికలను కనుగొనడానికి NewsMeter ఇంటర్నెట్ లో వెతకగా.. ఈ పుకార్లు మినహా ఎలాంటి నివేదికలను కనుగొనలేకపోయారు.
మేము CBS న్యూస్ ద్వారా ఒక నివేదికను కనుగొన్నాము, క్వీన్ రెండు కార్గిస్-ముయిక్ (మిక్ అని ఉచ్ఛరిస్తారు), శాండీ-లను రాణి కుమారులలో ఒకరైన ప్రిన్స్ ఆండ్రూ చూసుకుంటారు. ఈ విషయాన్ని ధృవీకరించారు. (will be looked after by one of the Queen's sons, Prince Andrew, and his ex-wife, Sarah, Andrew's team confirmed to Britain's PA news agency.)
కార్గిస్ కుక్కలకు సంబంధించి మరొక నివేదికను మేము కనుగొన్నాము. "ఎలిజబెత్ మరో రెండు కుక్కలను ఎవరు చూస్తారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు-లిస్సీ అనే కాకర్ స్పానియల్, క్యాండీ అనే డాచ్‌షండ్ కార్గి హైబ్రిడ్. కుక్కలను వేరు చేసి వివిధ కుటుంబ సభ్యులకు అందించవచ్చని కూడా ప్రచారం సాగుతోంది"
ఈ వార్తలు కేవలం పుకార్లే అని తేలిపోయింది. క్వీన్‌తో ఏ కార్గి కుక్కను కూడా ఖననం చేయబడలేదు. వైరల్ అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.