Fact Check : ఆర్‌బీఐ 2000 రూపాయల నోట్ల సర్క్యులేషన్ ను ఆపివేసిందా..?

RBI has not stopped circulating Rs 2000 notes. 2000 రూపాయల నోట్లకు సంబంధించిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ

By Medi Samrat  Published on  7 Dec 2020 4:17 AM GMT
Fact Check : ఆర్‌బీఐ 2000 రూపాయల నోట్ల సర్క్యులేషన్ ను ఆపివేసిందా..?

2000 రూపాయల నోట్లకు సంబంధించిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఆ పోస్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్ల సప్లైను ఆపి వేసినట్లు ఉంది. ఇకపై ఏటీఎంలలో విత్ డ్రా అన్నది కొడితే 2000 రూపాయల నోట్లు రావని.. కేవలం 100, 200, 500 రూపాయల నోట్లు మాత్రమే వస్తాయని అందులో ఉంది.

"Now Rs 2,000 notes won't be available in ATMs. The Reserve Bank has stopped issuing Rs 2,000 notes. Banks have started removing Rs 2,000 note calibers from ATMs. It has been started by the Central Bank of India, which has removed Rs 2,000 note calibers from 58 ATMs. Other banks are also saying that only Rs 100, Rs 200 and Rs 500 notes are being loaded in ATMs," అంటూ పోస్టులు వైరల్ అవుతూ ఉంది.

'ఇప్పటి నుండి ఏటీఎంలలో 2000 రూపాయల నోట్లు ఏటీఎంలలో లభించవు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇప్పటికే 2000 రూపాయల నోట్లను ఇష్యూ చేయడం ఆపివేసింది. ఇప్పటికే బ్యాంకులు కూడా తమ ఏటీఎం మెషీన్ల నుండి 2000 నోట్ ఉంచే క్యాలిబర్లను తీసేశాయి. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇప్పటికే తమ బ్యాంకుకు చెందిన 58 ఏటీఎంలలో నుండి 2000 రూపాయలు ఉంచే క్యాలిబర్లను తీసివేసింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో కేవలం 100, 200, 500 రూపాయల నోట్లను మాత్రమే లోడ్ చేస్తున్నారు' అన్నది మెసేజీ సారాంశం.

నిజ నిర్ధారణ:

ఇలాంటి కథనానికి సంబంధించిన ఎటువంటి రిపోర్టులు కూడా న్యూస్ మీటర్ కు లభించలేదు. ఈ వార్తల్లో కూడా ఎటువంటి నిజాలు లేవు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వెబ్సైట్, సామాజిక మాధ్యామాల్లో కూడా ఇటువంటి స్టేట్మెంట్ లభించలేదు. ఆర్.బీ.ఐ. నుండి ఇటువంటి నోటిఫికేషన్లు రాలేదు.


ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఈ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని ఖండించింది. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్వీట్ కూడా చేసింది. 2000 రూపాయల నోట్ల సర్క్యులేషన్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపివేస్తున్నట్లుగా ఎటువంటి నిజం లేదని, ఈ వదంతులను నమ్మవద్దని స్పష్టం చేసింది.

ఆర్.బీ.ఐ. 2000 రూపాయల నోట్ల సర్క్యులేషన్ ను ఆపివేసిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.


Claim Review:ఆర్‌బీఐ 2000 రూపాయల నోట్ల సర్క్యులేషన్ ను ఆపివేసిందా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media
Claim Fact Check:False
Next Story