FactCheck : ప్రధాని నరేంద్ర మోదీ గాడ్సేకు నివాళులు అర్పించారా..?

PM Modi paid tributes to Deendayal Upadhyay, not Godse. మహాత్మా గాంధీకి, ఆయనను చంపిన నాథూ రామ్ గాడ్సేకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2022 6:21 PM IST
FactCheck : ప్రధాని నరేంద్ర మోదీ గాడ్సేకు నివాళులు అర్పించారా..?

మహాత్మా గాంధీకి, ఆయనను చంపిన నాథూ రామ్ గాడ్సేకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పిస్తున్నారని పేర్కొంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి.



మహాత్ముడి హంతకుడికి ప్రధాని మోదీ ఎంతో గౌరవం ఇస్తున్నారని ఫోటోలను షేర్ చేస్తూ కొందరు చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వీరేంద్ర చౌదరి అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అదే వాదనతో ఫోటోలను పంచుకున్నారు.

నిజ నిర్ధారణ :

NewsMeter బృందం రెండో ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. అయితే అదే ఫోటోను గతంలో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ట్వీట్ చేసింది. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ప్రధాని మోదీ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్‌కు నివాళులర్పించారు.

రెండవ ఫోటోలో ప్రధాని మోదీ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్‌కు నివాళులర్పిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి.. నాథూరామ్ గాడ్సేకు నివాళులర్పిస్తున్నారనే వాదన అబద్ధం. కొందరు కావాలనే గాడ్సే కు మోదీ నివాళులు అర్పిస్తున్నారని చెబుతూ వస్తున్నారు. ఈ వార్తల్లోనూ.. పోస్టుల్లోనూ ఎటువంటి నిజం లేదు.

భారతీయ జనతాపార్టీ అధికారిక వెబ్సైట్ ప్రకారం "పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 1953 నుండి 1968 వరకు భారతీయ జనసంఘ్ నాయకుడు. తత్వవేత్త, వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ అత్యున్నత ప్రమాణాలను కొనసాగించిన నాయకుడు. ఆయన బీజీపీ సైద్ధాంతిక మార్గదర్శిగా ఉన్నారు." అని ఉంది. "Pandit Deendayal Upadhyaya was the leader of the Bharatiya Jana Sangh from 1953 to 1968. A profound philosopher, organizer par excellence, and leader who maintained the highest standards of personal integrity, he has been the source of ideological guidance and moral inspiration for the BJP since its inception. His treatise Integral Humanism, which is a critique of both communism and capitalism, provides a holistic alternative perspective for political action and statecraft consistent with the laws of Creation and the universal needs of the human race." అంటూ భారతీయ జనతా పార్టీ వెబ్సైట్ లో చెప్పుకొచ్చారు.

కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ప్రధాని మోదీ నమస్కరిస్తూ ఉంది గాంధీని చంపిన గాడ్సేను కాదు.


Claim Review:ప్రధాని నరేంద్ర మోదీ గాడ్సేకు నివాళులు అర్పించారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media Users
Claim Fact Check:False
Next Story