FactCheck : పేదలకు తప్పుడు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలవగలమని ప్రధాని మోదీ అనలేదు
PM Modi did not say elections can be won by selling false dreams to poor. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన మూడు క్లిప్‌లతో కూడిన ఫేస్‌బుక్ రీల్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 March 2023 8:45 PM ISTప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన మూడు క్లిప్‌లతో కూడిన ఫేస్‌బుక్ రీల్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. క్లిప్‌లలో “ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు” అని ఆయన చెప్పడం వినవచ్చు. "పేదలకు కలలు అమ్మండి, వారికి అబద్ధాలు చెప్పండి, వారిని ఒకరితో ఒకరు పోట్లాడుకునేలా చేయండి.. పాలించండి".. "ఇది మనం.. మన ఆలోచనా విధానం" అని కూడా ఆయన చెప్పారు.
ఈ వీడియోతో పాటు “ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ కష్టపడాల్సిన అవసరం లేదు, హిందూ-ముస్లిం సమస్యను రేకెత్తిస్తూ ఉంటే చాలు” అని కామెంట్ రాసి ఉంది.
నిజ నిర్ధారణ :
మూడు క్లిప్‌లు వేర్వేరు వీడియోలకు సంబంధించినవి. సరైన సంబంధం లేకుండా వీడియోలను కలిపి షేర్ చేస్తున్నారని NewsMeter కనుగొంది.
మేము కీవర్డ్ శోధనను నిర్వహించాము. సెప్టెంబర్ 2022 కి సంబంధించిన దైనిక్ భాస్కర్ కథనంలో వీడియోను కనుగొన్నాం. అందులో ఎక్కువ నిడివి ఉన్న వీడియోను గుర్తించాం. వీడియో గోవాలోని పనాజీకి సంబంధించింది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న “హర్ ఘర్ జల్ ఉత్సవ్” కు సంబంధించినది.
"ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒకరు కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ దేశాన్ని నిర్మించడానికి, ప్రతి ఒక్కరూ కష్టపడాలి" అని మోదీ చెప్పడం వినవచ్చు. మేము దేశ నిర్మాణ మార్గాన్ని ఎంచుకున్నాము. మేము దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను నిరంతరం పరిష్కరిస్తున్నాము. దేశం గురించి పట్టించుకోని వ్యక్తులు.. దేశ వర్తమానం, భవిష్యత్తు గురించి పట్టించుకోరని అన్నారు.
మేము 7 సెప్టెంబర్ 2022న DD నేషనల్ ప్రచురించిన 22 నిమిషాల వీడియోను కూడా కనుగొన్నాము. టైటిల్ “PM’s video message at Har Ghar Jal Utsav in Panaji, Goa.” అని ఉంది. 7.40 నిమిషాల మార్క్ వద్ద, ప్రధాని మోదీ మాటలు చెప్పడం వినవచ్చు.
రెండవ క్లిప్ అస్సాంలోని బోకాఖత్‌లో 21 మార్చి 2021న జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. BJP అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 42.27 నిమిషాల నిడివి గల వీడియోను తనిఖీ చేసినప్పుడు, 35.20 నిమిషాల మార్క్ వద్ద వైరల్ క్లిప్ కనిపించింది. "పేదలకు అబద్ధాలు చెప్పండి, వారిని ఒకరితో ఒకరు పోట్లాడుకునేలా చేయండి.. అధికారంలో కొనసాగడానికి ఇది ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ పాటించే సూత్రం" అని మోదీ చెప్పడం వినవచ్చు.
మూడవ క్లిప్ 2019లో లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానం.
మూడు క్లిప్‌లు మూడు వేర్వేరు వీడియోల నుండి వచ్చినవి. పేదలకు తప్పుడు హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలుస్తామని ప్రధాని మోదీ ఎప్పుడూ చెప్పలేదని మేము నిర్ధారించాము. మూడు క్లిప్‌లను కలిగి ఉన్న వీడియో ప్రజలను తప్పుదారి పట్టించేది.
- Credits : Md Mahfooz Alam