Fact Check : పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యాక చన్నీ స్వయంగా కరెంట్ పోల్ ఎక్కారా..?

Picture of Punjab CM Climbing Electricity Pole Dates back to 2016. ఓ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌లోని

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Oct 2021 8:55 AM GMT
Fact Check : పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యాక చన్నీ స్వయంగా కరెంట్ పోల్ ఎక్కారా..?

ఓ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌లోని కురాలిలో విద్యుత్‌ను పునరుద్ధరించడంలో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సహాయం చేశారని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు. చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుందని ప్రచారం జరుగుతోంది.

"పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీకి కురాలి ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చాయి. పేద ప్రజలు కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో ఆ ప్రాంతంలో కరెంటు కట్‌ అయిందని చన్నీకి తెలిసింది. చన్నీ ఆ స్థలానికి వెళ్లి స్వయంగా పోలింగ్‌ ఎక్కి విద్యుత్‌ను పునరుద్ధరించారు " అనే సందేశం వైరల్ అవుతూ ఉంది.

నిజ నిర్ధారణ :

చరణ్‌జిత్ చన్నీ ముఖ్యమంత్రి అయ్యాక ఇలా కరెంట్ స్థంభం ఎక్కారని వైరల్ అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.

న్యూస్ మీటర్ వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ ఫోటో 2016లో తీసిందని స్పష్టమవుతోంది. అప్పటికి చన్నీ ముఖ్యమంత్రి అవ్వలేదు. 'The Tribune' లో అందుకు సంబంధించిన వార్త కూడా వచ్చింది. 2016 జూలైలో చన్నీ విద్యుత్ స్తంభం ఎక్కి సిహోన్ మజ్రా గ్రామం (పంజాబ్) వాటర్‌వర్క్స్‌ కు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు పేర్కొంది.

ఆ సంవత్సరంలో చన్నీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి నాయకుడిగా ఉన్నారు. నివేదికలోని చిత్రం యొక్క శీర్షికలో "CLP నాయకుడు చరణ్ జిత్ సింగ్ చన్నీ ఈరోజు విద్యుత్ స్తంభం ఎక్కి, సిహోన్ మజ్రా గ్రామంలోని వాటర్‌వర్క్స్‌కు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు." అని ఉంది. ఈ సంఘటనను ది హిందుస్థాన్ టైమ్స్ మరియు ది టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా నివేదించాయి.

"బిల్లులు చెల్లించనందున ప్రభుత్వం ఏదైనా గ్రామ వాటర్‌వర్క్‌కు విద్యుత్‌ను డిస్‌కనెక్ట్ చేస్తే పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ నివాసానికి నీరు మరియు విద్యుత్ సరఫరాను డిస్‌కనెక్ట్ చేస్తానని" అప్పట్లో చన్నీ హెచ్చరికలు జారీ చేశారు.పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (PSPCL) డిస్‌కనెక్ట్ చేయబడిన విద్యుత్ సరఫరాను తిరిగి కనెక్ట్ చేయడానికి స్తంభం ఎక్కిన చన్నీపై అప్పట్లో చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.

ఈ సంఘటన 2016 లో జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 20 న చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాకుండా, వైరల్ పోస్ట్‌లో క్లెయిమ్ చేసినట్లుగా చన్నీ విద్యుత్‌ను పునరుద్ధరిస్తున్నట్లు న్యూస్‌మీటర్ ఇటీవలి కాలంలో ఎటువంటి నివేదికను కనుగొనలేకపోయింది. కాబట్టి ఒకప్పటి పోస్టును ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక చేసిన పనిగా కొందరు ప్రచారం చేస్తూ ఉన్నారు.


Claim Review:పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యాక చన్నీ స్వయంగా కరెంట్ పోల్ ఎక్కారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook, Twitter Users
Claim Fact Check:False
Next Story