రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ టపాసులు కాలుస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన ఉన్న రాష్ట్రంలో టపాసులు బ్యాన్ అని చెప్పినా కూడా ఇలా టపాసులు కాల్చారని పలువురు సెటైర్లు వేస్తూ పోస్టులు పెడుతూ వస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఆయన టపాసులు కాల్చారని.. ముఖ్యమంత్రి ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు.
నిజ నిర్ధారణ:
రాజస్థాన్ రాష్ట్రంలో టపాసులు బ్యాన్ అని చెప్పినా కూడా అశోక్ గెహ్లాట్ టపాసులు కాల్చాడన్నది 'పచ్చి అబద్ధం'.
న్యూస్ మీటర్ ఈ ఫోటో మీద రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోను 28 అక్టోబర్ 2019న అశోక్ గెహ్లాట్ ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేశారు. "Celebrated #Diwali with #family #diwalicelebration" అంటూ అప్లోడ్ చేశారు. గత ఏడాది దీపావళి సందర్భంగా తీసిన ఫోటో ఇదని స్పష్టంగా తెలుస్తోంది.
ఈ ఫోటోతో పాటూ, మరో మూడు ఫోటోలను అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ అక్టోబర్ 2019న తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
"On the occasion of Deepawali, family worshiped Lakshmi Maa. #DiwaliCelebration #HappyNewYear #Lakshmipooja". అంటూ పోస్టులు పెట్టారు.
Hamara Samachar అనే ఫేస్ బుక్ పేజీలో కూడా అక్టోబర్ 2019న ఇదే ఫోటోలను అప్లోడ్ చేశారు. "Diwali Glimpse: CM Ashok Gehlot celebrated #Diwali with family. #HappyDiwali #HappyDeepavali" అంటూ దీపావళి పండుగ రోజు చేసిన పూజకు సంబంధించిన ఫోటోలని స్పష్టంగా తెలియజేశారు.
అశోక్ గెహ్లాట్ ఆయన కుటుంబం ఈ ఏడాది టపాసులు కాల్చారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. ఈ ఫోటోలు 2019లో వచ్చిన దీపావళికి సంబంధించినది.