FactCheck : రోహిత్ శర్మ కుమార్తెకు సంబంధించిన వీడియో ఇటీవలిది కాదు

రోహిత్ శర్మ కుమార్తె మీడియాతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Nov 2023 2:30 PM GMT
FactCheck : రోహిత్ శర్మ కుమార్తెకు సంబంధించిన వీడియో ఇటీవలిది కాదు

రోహిత్ శర్మ కుమార్తె మీడియాతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. తప్పుడు కథనంతో వీడియోను షేర్ చేస్తున్నారు. ప్రపంచ కప్ ఓటమి తర్వాత ఈ వీడియోను రికార్డు చేశారని అంటున్నారు.

ICC ప్రపంచ కప్ 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమి తర్వాత, సోషల్ మీడియాలో అనేక పాత వీడియోలు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. అలాంటిదే ఇది కూడా!!

వైరల్ వీడియోలో రోహిత్ శర్మ కుమార్తె సమైరా శర్మ.. 'అతను గదిలో ఉన్నాడు, ఒక తర్వాత నవ్వుతాడు' అని చెప్పడం చూడవచ్చు.

ఇలాంటి పోస్ట్‌లు వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇదే వీడియోను మిర్రర్ నౌ, ఆరీ న్యూస్ వంటి ప్రముఖ ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు కూడా అప్‌లోడ్ చేశాయి.

నిజ నిర్ధారణ :

న్యూస్‌మీటర్ బృందం ఈ వీడియో పాతది.. ప్రపంచ కప్ 2023కి సంబంధం లేనిదని గుర్తించింది. కాబట్టి వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. మేము #Samaira అనే కీవర్డ్‌ని ఉపయోగించి Xలో సాధారణ కీవర్డ్ శోధనను నిర్వహించాము. నవంబర్ 24 న అప్లోడ్ చేసిన అదే వీడియోను కనుగొన్నాము.

మరింత సెర్చ్ చేయగా.. రోహిత్ శర్మ కోవిడ్ పాజిటివ్‌గా ఉన్న సందర్భంలో జూన్ 28, 2022న అప్లోడ్ చేసిన అదే వీడియోను మేము కనుగొన్నాము. రోహిత్ శర్మ కూతురు సమైరా తన తండ్రి గురించి హెల్త్ అప్‌డేట్ ఇచ్చింది అంటూ వీడియోను షేర్ చేశారు. ఆమె ఎంత ముద్దుగా మాట్లాడుతుందో చూడండి అంటూ అప్పట్లో ఈ వీడియోను షేర్ చేశారు.

దీన్ని ఒక క్యూగా తీసుకుని.. మేము కీవర్డ్‌ సెర్చ్ చేసాము. YouTubeలో ఈ వీడియోకు సంబంధించిన షార్ట్‌లు గత సంవత్సరం జూన్ 2022లో అప్‌లోడ్ చేశారని కనుగొన్నాము. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోనే అప్పట్లో కూడా అప్లోడ్ చేశారు.

మేము జూన్ 28, 2022 నాటి నవభారత్ హిందీకి సంబంధించిన మీడియా రిపోర్ట్‌తో పాటు అందులో ఉన్న ట్వీట్‌ను కూడా కనుగొన్నాము. నివేదిక ప్రకారం, 'భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌ కోసం అతను వచ్చాడు. రోహిత్ శర్మ కూతురు సమైరా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సమైరా తన తల్లి రితికా, నానీతో కలిసి హోటల్ నుండి బయటకు వస్తుంది.' అని అందులో ఉంది. కాబట్టి.. వైరల్ వీడియో ఇటీవల ప్రపంచ కప్ సమయంలో చోటు చేసుకున్నది కాదని.. గతంలో కరోనా సమయంలో చోటు చేసుకున్నదని స్పష్టంగా తెలుస్తోంది.

Credits : Sunanda Naik

Claim Review:రోహిత్ శర్మ కుమార్తెకు సంబంధించిన వీడియో ఇటీవలిది కాదు
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:False
Next Story