FactCheck : కేరళలో త్రివర్ణ పతాకాన్ని అవమానించారా.?

రోడ్డు మీద పెయింట్ చేసిన భారత త్రివర్ణ పతాకాన్ని వాహనాలు తొక్కుకుంటూ వెళుతుండగా.. కొందరు వ్యక్తులు పాకిస్థాన్ జెండాను ఊపుతూ సంబరాలు జరుపుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 May 2024 7:06 AM IST
FactCheck : కేరళలో త్రివర్ణ పతాకాన్ని అవమానించారా.?

రోడ్డు మీద పెయింట్ చేసిన భారత త్రివర్ణ పతాకాన్ని వాహనాలు తొక్కుకుంటూ వెళుతుండగా.. కొందరు వ్యక్తులు పాకిస్థాన్ జెండాను ఊపుతూ సంబరాలు జరుపుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన కేరళలో జరిగినట్లు సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు.

"Watch this video of Kerala and forward it as much as you can....if u keep quiet today we will be at a loss...because after 6 months there will be no use to pursue it... swing your fingers and forward it now" అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు.

ఈ ఘటన కేరళలో జరిగిందని.. ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేయాలని కోరుతున్నామని అందులో తెలిపారు. మీరు ఈరోజు సైలెంట్ గా ఉంటే రాబోయే రోజుల్లో ఏమైనా జరగొచ్చు అనే అర్థం వచ్చేలా పోస్టులు పెడుతూ ఉన్నారు.

ఈ వీడియో సర్క్యులేషన్‌లోకి రావడం ఇది మొదటిసారి కాదు. అనేక మంది ఇతర వినియోగదారులు అదే వాదనతో సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉండడంతో ఇది గత కొన్ని సంవత్సరాలుగా వైరల్‌ అవుతూ ఉంది.

2022, 2023 సంవత్సరాలలో కూడా ఈ వీడియో వైరల్ అయింది.

తమిళనాడులో చోటు చేసుకుందంటూ 2022లో ఇదే వీడియో వైరల్ అయింది.

నిజ నిర్ధారణ:

ఈ వైరల్ వీడియో 2020 నాటిదని.. ఇది ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని NewsMeter కనుగొంది. ఈ వీడియో పాకిస్తాన్ నుండి వచ్చింది. కేరళలో చోటు చేసుకున్న ఘటన కాదు.

వైరల్ వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, మేము పాకిస్తానీ జెండాని, ఆటో-రిక్షాల రంగు వంటి కొన్ని అంశాలను గుర్తించాము. ఈ ఆధారాల కారణంగా ఈ వీడియోను భారతదేశంలో చిత్రీకరించలేదని గుర్తించాం. కేరళలో ఇలాంటి సంఘటనల గురించి నివేదికలను వెలికితీసేందుకు మేము కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. అయితే, మా సెర్చ్ లో ఈ ఘటనకు సంబంధించిన నివేదికలను కనుగొనలేకపోయాము.

మరింత పరిశోధనలో భాగంగా.. మేము వీడియో నుండి సంబంధిత కీఫ్రేమ్‌లతో Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించాము. మార్చి 10, 2020న Xలో అప్‌లోడ్ చేసిన వైరల్ వీడియో నుండి ఈ స్టిల్‌ను కనుగొన్నాము.

"Salute to this man on a motorcycle. In 2 2-minute video, this man is the only one who refused to step on the Indian flag, passed beside the flag." అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేశారు. ఒక వ్యక్తి మాత్రమే భారత జెండా మీద నడుచుకుంటూ వెళ్లలేదని.. అలాంటి వ్యక్తిని అభినందించాలంటూ వీడియోను షేర్ చేస్తున్న వ్యక్తులు తెలిపారు.

ఈ ఆధారాల కారణంగా వీడియో ఇటీవలిది కాదని సూచిస్తుంది.

మా సెర్చ్ ద్వారా, మేము వైరల్ వీడియోకు సంబంధించిన నిడివి ఎక్కువ ఉన్న వీడియోను కనుగొన్నాము. వీడియోలో, మేము 'ది హునార్ ఫౌండేషన్' పేరుతో ఒక వ్యాన్‌ను గమనించాము. హునార్ ఫౌండేషన్ యువతను ఆర్థికంగా బలోపేతం చేయడానికి వృత్తిపరమైన శిక్షణను అందిస్తుంది, Google ప్రకారం వారి చిరునామా కరాచీలో ఉంది. ఈ వివరాల ప్రకారం కరాచీలో వీడియో చిత్రీకరించారని భావించవచ్చు.

తర్వాత, ఆకుపచ్చ రంగులో 'PTCL' అని ఉన్న తెల్లటి వాహనాన్ని మేము గమనించాము. తదుపరి దర్యాప్తులో.. PTCL అంటే పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ కంపెనీ లిమిటెడ్, పాకిస్తాన్‌లోని జాతీయ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ అని మేము కనుగొన్నాము.


'Sanam Boutique' అనే సైన్ బోర్డును కూడా గమనించాం. కీవర్డ్ సెర్చ్ ద్వారా, మేము కరాచీలో 'సనం' అనే దుకాణాన్ని గుర్తించాము. పాకిస్థాన్‌లోని కరాచీలోని తారిఖ్ రోడ్‌లో ఉన్న 'సనమ్ బోటిక్'ని మేము కనుగొన్నాం.


జియోలొకేషన్‌ని ఉపయోగించి, మేము భారత వ్యతిరేక ర్యాలీ జరిగిన ప్రాంతాన్ని మేము కనుగొన్నాము.


అందువల్ల, ఈ సంఘటన కేరళలో లేదా తమిళనాడులో చోటు చేసుకోలేదని నిర్ధారించాము. పాకిస్థాన్‌లోని కరాచీలోని తారిఖ్ రోడ్‌లో దీన్ని చిత్రీకరించారు.

Credits : Sunanda Naik

Claim Review:కేరళలో త్రివర్ణ పతాకాన్ని అవమానించారా.?
Claimed By:Social Media User
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X, Facebook
Claim Fact Check:False
Next Story