FactCheck : పాకిస్థాన్ క్రికెట్ జట్టు తినడం కోసం ఇంతగా గొడవ పడిందా?

2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్‌కు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Oct 2023 9:30 PM IST
FactCheck : పాకిస్థాన్ క్రికెట్ జట్టు తినడం కోసం ఇంతగా గొడవ పడిందా?

2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్‌కు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో అనేక తప్పుదోవ పట్టించే వాదనలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక హోటల్‌లో ఫుడ్ తినే సమయంలో బఫేలో గందరగోళాన్ని చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది భారతదేశానికి వచ్చిన తర్వాత పాకిస్తాన్ జట్టు తినడానికి ఎంతగానో ఆరాటపడిందని కొందరు సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.

ఒక ట్విట్టర్ వినియోగదారుడు “Pakistani cricket team arrived in India today and that’s how they had dinner. (sic)” అంటూ ఈ వీడియోను పంచుకున్నారు. పాకిస్తానీ క్రికెట్ జట్టు ఈ రోజు భారతదేశానికి చేరుకుందని.. ఈ విధంగా భోజనం చేసారని అందులో చెప్పుకొచ్చారు.

చాలా మంది X, Facebook వినియోగదారులు అదే క్లెయిమ్ చేస్తూ వీడియోను షేర్ చేశారు.

నిజ నిర్ధారణ :

న్యూస్‌మీటర్ బృందం ఈ వాదనలో ఎటువంటి నిజం లేదని కనుగొంది. వీడియో 2020 నాటిది. లాహోర్ బార్ ఎలక్షన్ డిన్నర్‌ కు సంబంధించినది.

వీడియో కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా.. ఈ వీడియోను మేము ట్విట్టర్ లో కనుగొన్నాము. అక్టోబర్ 3 2020న పోస్ట్ చేశారు. “That’s Lahore’s Bar Election Dinner! How elegant.” అనే టైటిల్ తో వీడియో అప్లోడ్ చేశారు.

మరొక X వినియోగదారు.. ఉస్మాన్ రజా జమీల్ కూడా అక్టోబర్ 1, 2020న ఈ వీడియోను పోస్ట్ చేశారు.

తోటి న్యాయవాదులపై విమర్శలు చేశారు. లాహోర్ బార్ ఎన్నికల సమయంలో మాంసాహారం కోసం ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. “Lahore bar election gathering zindabad.. let’s slap each other to get first dibs on the meat – let’s keep our facemasks off whilst we push and shove and let’s show the next generation of lawyers what lies ahead for their time.. (sic)” అంటూ పోస్టు పెట్టారు.

"కరోనా ఫ్రీ, లాహోర్ బార్ ఎలక్షన్స్" అనే శీర్షికతో అక్టోబర్ 2020లో ఈ వీడియోను షేర్ చేసిన అనేక Facebook ఖాతాలను కూడా మేము కనుగొన్నాము.

NewsMeter వీడియో మూలాన్ని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది. అయితే, వీడియో 2020 నుండి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది.

ప్రపంచ కప్ 2023 ఆడేందుకు భారత్‌కు వచ్చిన తర్వాత పాకిస్తాన్ జట్టు విందుకు సంబంధించిన వీడియో ఇది కాదని మేము ధృవీకరించాము.

Credits : Md Mahfooz Alam

Claim Review:పాకిస్థాన్ క్రికెట్ జట్టు తినడం కోసం ఇంతగా గొడవ పడిందా?
Claimed By:X User
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:False
Next Story