మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలోని పోలింగ్ బూత్‌లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని సోషల్ మీడియా వినియోగదారులు ఓ వీడియోను షేర్ చేశారు.
పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
“ఈ వీడియో MIM బహదూర్‌పురాకు చెందినదని చెప్పబడింది! దయచేసి దీన్ని వైరల్ చేయండి, తద్వారా ఎన్నికల సంఘం మళ్లీ ఎన్నిక నిర్వహిస్తుంది. దయచేసి ఇది అందరికీ చేరేలా చూడండి." అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు.
పలు సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
నిజ నిర్ధారణ :
ఈ వీడియో పశ్చిమ బెంగాల్‌లో 2022 మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినదని న్యూస్‌మీటర్ గుర్తించింది. ఈ వీడియోకు తెలంగాణ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు.
వీడియోలోని వ్యక్తులు బంగ్లాలో మాట్లాడుతున్నట్లు న్యూస్‌మీటర్ బృందం కనుగొంది. దీన్ని ఒక క్యూగా తీసుకుని, మేము కీవర్డ్ సెర్చ్ చేయడమే కాకుండా.. వీడియో కీఫ్రేమ్ లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. 27 ఫిబ్రవరి 2022న భారతీయ జనతా పార్టీ (BJP), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPIM) పోస్ట్ చేసిన వీడియోలను మేము కనుగొన్నాము. రెండు పార్టీలు తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఓట్ల రిగ్గింగ్ చేశాయని ఆరోపించాయి.
అదే తేదీన, కాంగ్రెస్ పార్టీ టిఎంసి ఓట్లను రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తూ వీడియోలోని విజువల్స్ తో పోలిన చిత్రాలను కూడా పోస్ట్ చేసింది.
ఇంకా, ఫిబ్రవరి 27న TV9 బంగ్లా ప్రచురించిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. 2022 పశ్చిమ బెంగాల్ మునిసిపల్ ఎన్నికల సమయంలో, సౌత్ డమ్ డమ్ లోని వార్డు నెం.108లోని బూత్ లో ఒక ఏజెంట్ ఓటు వేస్తున్నాడని తెలిపింది.
ఈ వీడియోను మరో బెంగాలీ డిజిటల్ ఛానెల్ 'ఆరోహి న్యూస్' కూడా ఫిబ్రవరి 27న ప్రచురించింది. సౌత్ డమ్ డమ్ లో ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఈ వీడియో పాతది, తెలంగాణకు చెందినది కాదని స్పష్టం చేశారు.
“ప్రిసైడింగ్ ఆఫీసర్ (సర్జికల్ మాస్క్ ధరించి) ఉన్న పోలింగ్ స్టేషన్ లోపలి భాగాన్ని చూపించే వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. క్లిప్‌లో ఒక వ్యక్తి (చారల ముదురు నీలం రంగు రౌండ్ కాలర్ T షర్టు ధరించి) ఒక కంపార్ట్‌మెంట్ పక్కన నిలబడి ఉన్నట్లు చూపిస్తుంది. వ్యక్తులు కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి బయటకు వస్తున్నారు, అయితే నీలిరంగు చారల టీ షర్ట్‌లో ఉన్న వ్యక్తి కంపార్ట్‌మెంట్ లోపలికి వెళ్లే వ్యక్తులకు మార్గదర్శకత్వం చేస్తున్నారు. ఈ వీడియో హైదరాబాద్ పీసీకి చెందిన బహదూర్‌పురాకి చెందినదని, ఇందులో పోలింగ్ స్టేషన్‌లో రిగ్గింగ్ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇది పాత వీడియో.. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలతో లేదా తెలంగాణలోని మరే ఇతర ఎన్నికలతోనూ ఈ వీడియోకు సంబంధం లేదని చెబుతున్నాము” అని ప్రకటనలో స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో ఓట్ల రిగ్గింగ్ జరగలేదని.. ఈ వీడియో పాతదని స్పష్టమైంది. ఇది పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన వీడియో.