ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే..! ఆ సమయంలో ఆయన పలువురు బీజేపీ మంత్రులను కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీని.. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కూడా కలుసుకున్నారు ఆదిత్యనాథ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆకుపచ్చ కుర్తాలో ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి పుస్తకం పట్టుకున్నట్లు ఫోటో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. వైరల్ చిత్రంలో, ఈ పుస్తకం "कांग्रेस मुक्त भारत (కాంగ్రెస్ రహిత భారతదేశం)" అని పేరు పెట్టబడింది. "#CongressMuktBharat" అనే హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజన్లు వైరల్ చేస్తూ ఉన్నారు.
https://twitter.com/pawanme3513/status/1403287222443413505
నిజ నిర్ధారణ:
వైరల్ చిత్రంలోని పుస్తకం ఫోటోను మార్ఫింగ్ చేశారు.
ఒరిజినల్ ఫోటోను న్యూస్‌మీటర్ జనసత్తా (ఇండియన్ ఎక్స్‌ప్రెస్ హిందీ దినపత్రిక), హిందూస్తాన్ టైమ్స్ లలో చూడొచ్చు. ఒరిజినల్ ఫోటోలో ఉన్న పుస్తకం హిందీలో "ప్రవాసి సంకట్ కా సమాధాన్ (వలసదారుల సమస్యకు పరిష్కారం)" అని స్పష్టంగా తెలుస్తోంది. ఒరిజినల్ ఫోటోను మార్ఫింగ్ చేసిన ఫోటోకు తేడాలను చూడొచ్చు
టైమ్స్ నౌ న్యూస్, ట్రిబ్యూన్ మీడియా సంస్థల కథనాల ప్రకారం, యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం నాడు కేంద్ర హోంమంత్రిని కలిశారు. సమావేశంలో వారు వలస కూలీల సమస్యలపై చర్చించారు. పలు విషయాలను వారు చర్చించారు. సమావేశం తరువాత, ఆదిత్యనాథ్ షాకు "ప్రవాసి సంకట్ కా సమాధాన్" అనే హిందీ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.
యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక ఖాతాల్లో అసలు చిత్రాన్ని కూడా పోస్ట్ చేసి, న్యూ ఢిల్లీలో షాతో సమావేశం గురించి ట్వీట్ చేశారు.
ఈ చిత్రాలన్నింటిలో ఈ పుస్తకానికి హిందీలో "ప్రవాసి సంకట్ కా సమాధాన్" అని పేరు ఉన్న బుక్ ఉంది కానీ "కాంగ్రెస్ లేని భారతదేశం" అనే పేరు ఉన్న పుస్తకం కానే కాదు. వైరల్ చిత్రాన్ని మార్ఫింగ్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.