ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీకి సంబంధించిన ఫొటోలు ఇవి.. అని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రధాని మోదీ తల్లి ఇటీవలే తుది శ్వాస విడిచారు. ఆమె అనారోగ్యానికి గురవడంతో అహ్మదాబాద్‌లోని మెహతా ఆసుపత్రికి తరలించారు. హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ప్రధాని తల్లి హీరాబెన్ మోదీ గాంధీనగర్ శివార్లలోని రైసన్ గ్రామంలో తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి నివసిస్తున్నారు. గుజరాత్ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా డిసెంబర్ 4న గాంధీనగర్‌లో ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్‌ను చివరిసారిగా కలిశారు.
నిజ నిర్ధారణ :
రీల్‌లోని మూడు చిత్రాలు హీరాబెన్ మోదీవి కాదని న్యూస్‌మీటర్ గుర్తించింది. వైరల్ అవుతున్న దావా ప్రజలను తప్పుదారి పట్టించేది.
చిత్రం 1:
మొదటి చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఫేస్‌బుక్ యూజర్ మర్యాల శ్రీనివాస్ పోస్ట్ చేసిన ఫ్యామిలీ ఫోటో మాకు కనిపించింది. అదే స్త్రీ కుడి వైపున కూర్చోవడం చూడవచ్చు. క్యాప్షన్ ప్రకారం, మహిళ మర్యాల శ్రీనివాస్ తల్లి.
చిత్రం 2
రెండవ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 30 డిసెంబర్ 2022న నవభారత్ టైమ్స్ ప్రచురించిన మోదీ కుటుంబ వృక్షంలోని కథనానికి దారితీసింది. ఆ కథనం ప్రకారం, ఈ చిత్రంలో ఉన్న మహిళ నరేంద్ర మోదీ సోదరి వసంతిబెన్ మోదీ.
చిత్రం 3
మూడవ చిత్రం రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించినప్పుడు, అదే మహిళ NDTVతో మాట్లాడుతున్నట్లు మేము కనుగొన్నాము. ఛానెల్ ప్రకారం, ఆమె ఫిల్మ్ జర్నలిస్ట్ భావన సోమయ్య.
ఈ ఫోటోలు ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీవి కావని స్పష్టమైంది. అందువల్ల, ఈ దావా ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.