హెడ్‌సెట్లు లేదా ఇయర్‌ఫోన్‌లు ధరించి బైక్‌లు, కార్లు, ఆటోలు నడుపుతున్న వారిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు నుంచి రూ. 20,000 జరిమానా విధించనున్నట్లు సోషల్ మీడియాలో ఓ సందేశం చక్కర్లు కొడుతోంది.
ఈ సందేశం వాట్సాప్‌లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
"బ్రేకింగ్ న్యూస్💥💥💥
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఇకపై డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ హెడ్సెట్ పెట్టుకుంటే 20000 జరిమానా
ఆగస్టు నెల నుంచి ప్రారంభం కానున్న జరిమానా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఇకపై బైక్ మీద కానీ కారులో కానీ ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ హెడ్సెట్ పెట్టుకుంటే 20000 జరిమానా వెనుంది దీనికి సంబంధించిన వివరాలు మొత్తం రవాణా శాఖకు జారీ చేసినట్లు వర్గాలు వెల్లడించాయి..." అంటూ పోస్టులు పెడుతున్నారు.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ బృందం ఈ వాదనలో ఎటువంటి నిజం లేదని కనుగొంది.
వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది నకిలీ సర్క్యులర్ అని.. వీటిని నమ్మకండని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కమిషనర్ ఒక ప్రకటనను విడుదల చేశారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 184 ప్రకారం ఎవరైనా ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్స్ ధరించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రూ.1500 నుంచి రూ.2000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించే నిబంధన ఇప్పటికే ఉందని తెలిపారు.
విశాఖపట్నం డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ జిసి రాజ రత్నం న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, హెడ్‌సెట్లు లేదా ఇయర్‌ఫోన్‌లతో వాహనాలు నడిపేవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 20,000 జరిమానా విధిస్తున్నట్లు వైరల్ సందేశం నకిలీదని ధృవీకరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కూడా వైరల్ అవుతున్నవి తప్పుడు కథనాలు అని ట్విట్టర్‌లో చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ ఎలాంటి కొత్త నిబంధనలను రూపొందించలేదని పేర్కొంది. "‘ఇక మీదట బైక్ మీద గానీ, కారులోగానీ, ఆటోలోగానీ ఇయర్‌ఫోన్స్ లేదా హెడ్‌సెట్ పెట్టుకుంటే రూ.20,000 జరిమానా విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’ అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఈ విషయంలో రాష్ట్ర రవాణా శాఖ కొత్తగా ఎలాంటి నిబంధనలూ పెట్టలేదు." అంటూ ట్వీట్ చేశారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam