Fact Check : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ లాక్ డౌన్ ప్రకటించారా..?

No Lockdown in Telangana Kcrs Video dates back to 2020. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. దేశంలోని చాలా

By Medi Samrat  Published on  22 March 2021 9:02 PM IST
Fact Check : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ లాక్ డౌన్ ప్రకటించారా..?

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి మరోసారి ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 18 న్యూస్.కామ్ లోగో ఉన్న వీడియో వైరల్ అవుతూ ఉంది. విద్యాసంస్థలు మూసి వేస్తున్నట్లుగా కేసీఆర్ చెబుతుండడమే కాకుండా.. పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తున్నామని అందులో చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ అంటూ ఈ వీడియోను పలువురు వాట్సాప్ లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ షేర్ చేస్తూ వచ్చారు.




ఇది కొత్తగా పెడుతున్న లాక్ డౌన్ కు సంబంధించిన వీడియో అని పలువురు పోస్టులు పెట్టారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.

వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకొని సెర్చ్ చేయగా.. వీడియో మార్చి 2020కి చెందినదని తేలింది.

ఇదే వీడియోను పలు మీడియా సంస్థలు టెలికాస్ట్ చేశాయి. మార్చి 14, 2020న కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇవి..! అప్పట్లో కరోనా కేసులు అధికమవుతూ ఉండడంతో లాక్ డౌన్ ను అమలు చేశారు. విద్యాసంస్థలు, మాల్స్, సినిమా హాల్స్.. ఇలా చాలా వాటిని మూసి వేస్తూ అప్పట్లో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వీడియో ఇది.


డైరెక్టర్ ఆఫ్ డిజిటల్ మీడియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని తేల్చేశారు. ఈ వీడియో ఇప్పటిది కాదని మార్చి 2020కి చెందినదని క్లారిటీ ఇచ్చారు.


"#FakeNewsAlert. An old clip of CM Sri KCR announcing lockdown is being spread on Social Media by some miscreants. Please note that this clip is from March 2020" అంటూ పోస్టు పెట్టారు.

వీడియోలో ఏ సంస్థ లోగో ఉందో.. సదరు సంస్థ కూడా ఇది తాజాగా విడుదల చేసిన వీడియో కాదని.. మార్చి 2020కు చెందిన వీడియో అంటూ తేల్చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ లాక్ డౌన్ ప్రకటించారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. ఈ వీడియో మార్చి 2020కి చెందినది.


Claim Review:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ లాక్ డౌన్ ప్రకటించారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Social Media
Claim Fact Check:False
Next Story