ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్‌ను సత్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ఆయనను సత్కరించింది వినియోగదారులు పేర్కొన్నారు.
న్యూస్ అరేనా ఇండియా, ఆగస్ట్ 25న ఈ వీడియోను షేర్ చేసింది, “ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో” (ISRO Chairman S Somanath at RSS office in Bengaluru) అనే శీర్షికతో వీడియోను పోస్టు చేసింది.
పలువురు ఎక్స్ ప్రీమియం, ఫేస్‌బుక్ వినియోగదారులు అదే క్లెయిమ్ చేస్తూ వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
బెంగళూరులోని చామరాజపేటలో రాష్ట్రోత్థాన పరిషత్‌లో జరిగిన కార్యక్రమంలో ఇస్రో చీఫ్‌ను ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే సన్మానించారని న్యూస్‌మీటర్ కనుగొంది. ఆర్‌ఎస్‌ఎస్ బెంగళూరు కార్యాలయంలో కాదని గుర్తించాం.
మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. వైరల్ వీడియోను కలిగి ఉన్న రాజేష్ పద్మర్ పోస్ట్‌ను చూశాము. పద్మర్ తన X బయోలో తనను తాను RSS ప్రచార అధిపతిగా (ప్రాంత్ ప్రచార్ ప్రముఖ్) పేర్కొన్నాడు.
“RSS Sarakaryavah Dattatreya Hosabale congratulated Dr S Somanath, Chairman of ISRO on successfully leading of #Chandrayan3, at Rashtrotthana Parishat, Chamarajapete, Bengaluru.” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ ను జూలై 19న ప్రచురించారు. ఆగస్టు 23న చంద్రయాన్-3 ల్యాండింగ్ జరిగింది. ఈ ల్యాండింగ్ కంటే ముందే ఈ ఘటన చోటు చేసుకుంది.
రాష్ట్రోత్థాన పరిషత్ అనేది 1965లో బెంగుళూరులో స్థాపించిన ప్రజా ధార్మిక ప్రభుత్వేతర సంస్థ (NGO) అని కూడా మేము కనుగొన్నాము. ‘రాష్ట్రోత్థాన పరిషత్ ఫెలిసిటేట్స్ ఇస్రో చీఫ్, డా. సోమనాథ్.’ అనే శీర్షికతో వెబ్‌సైట్‌లో ఒక కథనాన్ని కూడా చూశాము. ఇస్రో చీఫ్‌కి ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన దత్తాత్రేయ హోసబాలే శాలువాతో సత్కరించినట్లు ఆ పేజీలో రాశారు. రాష్ట్రోత్థాన పరిషత్ అధ్యక్షుడు ఎంపి కుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్ దినేష్ హెగ్డే సమక్షంలో చంద్రయాన్-3 మిషన్ నాయకత్వాన్ని వహిస్తున్నందుకు దత్తాత్రేయ హోసబాలే డా. సోమనాథ్ ను సత్కరించారు.
కాబట్టి, చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత బెంగుళూరులోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో ఇస్రో చీఫ్‌కు సన్మానం చేశారనే వాదన తప్పు అని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam