ఉత్తరాఖండ్‌లో ముస్లిం జనాభా గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా పెరిగిందని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు తెలిపారు. ఈ వాదనల ప్రకారం 2000లో మొత్తం జనాభాలో ముస్లింల జనాభా 1.5 శాతంగా ఉండగా.. 2024 నాటికి 16 శాతానికి పెరిగిందని వాదిస్తూ ఉన్నారు.
వైరల్ పోస్టు పెట్టిన ఒక X వినియోగదారు "2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌లో ముస్లిం జనాభా 1.5%, 2024లో ఇది 16%." అని తెలిపారు. ఉత్తరాఖండ్ ఏర్పాటు గురించి చర్చించడమే కాకుండా, ఆ రాష్ట్రంలోని నగరాలు, ప్రకృతి, రాష్ట్ర అందాలను హైలైట్ చేస్తూ పోస్ట్‌తో పాటు ఒక వీడియో కూడా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ముస్లిం జనాభా 13.95 శాతం ఉందని ఆ వీడియోలో పేర్కొన్నారు.
నిజ నిర్ధారణ:
2021లో జరగాల్సిన జనాభాగణన 2024-25కి వాయిదా పడింది. దీంతో ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని NewsMeter కనుగొంది. అయితే 2000 సంవత్సరంలో రాష్ట్రంలో ముస్లిం జనాభా 1.5 శాతం మాత్రమే ఉందన్న వాదన కూడా సరికాదు.
మేము సంబంధిత కీవర్డ్ సర్చ్ ను నిర్వహించాము. ఇండియా టుడే జనవరి 22, 2015 న ఒక నివేదికను ప్రచురించింది. అలాగే Zee న్యూస్ ద్వారా సెప్టెంబర్ 2, 2024 న ఒక కథనం కనుగొన్నారు. ఉత్తరాఖండ్ ముస్లిం జనాభా 11.9 నుండి 13.9 శాతానికి పెరిగిందని రెండు నివేదికలు పేర్కొన్నాయి. 2001 నుండి 2011 మధ్య రెండు శాతం పెరుగుదల ఉందని ఈ నివేదికలు చెబుతున్నాయి.
ఫిబ్రవరి 7, 2024 నాటి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో హిందువులు 82.97 శాతం ఉండగా, ముస్లింలు 13.95 శాతంగా ఉన్నారు.
అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌ల డేటాకు సంబంధించి 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్ జనాభా 2001 లో 84.89 లక్షలు ఉండగా.. 2011 సంవత్సరంలో 1.01 కోట్లకు పెరిగింది. 2001లో రాష్ట్ర ముస్లిం జనాభా 10.12 లక్షలు, అప్పుడు రాష్ట్ర మొత్తం జనాభాలో 11.92 శాతం. 2011 జనాభా లెక్కల ప్రకారం ముస్లిం జనాభా 14.07 లక్షలకు పెరిగింది, ఇది మొత్తం జనాభాలో 13.95 శాతంగా ఉంది. 2001 నుండి 2011 మధ్య ముస్లింల జనాభా 2.03 శాతం స్పష్టమైన వృద్ధిని చూపిస్తోంది.
కాబట్టి, 2000లో ఉత్తరాఖండ్ మొత్తం జనాభాలో 1.5 శాతం మాత్రమే ముస్లింలు ఉన్నారనే వాదన అబద్ధం. అలాగే 2024లో ముస్లింల జనాభా 16 శాతానికి పెరిగింది అనే మరో వాదన కూడా అబద్ధమని మేము నిర్ధారించాము.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Credit : Md Mahfooz Alam