తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఒక అధికారి, ఇద్దరు ముస్లిం మతపెద్దలు, మరికొంత మందిని చూపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ముస్లిం మతపెద్దలు ఇస్లామిక్ ప్రార్థనలతో తెలంగాణలో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు వీడియోను షేర్ చేస్తున్న వ్యక్తులు చెప్పారు. కేవలం ముస్లిం ముల్లాలతో మాత్రమే కలెక్టరేట్ ను ఓపెనింగ్ చేయించారని చాలా మంది చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఒక ముస్లిం మత పెద్ద ముల్లా ద్వారా కలెక్టర్ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించారని చెప్పుకొచ్చారు. భారతదేశంలో ఇస్లామీకరణ ఇప్పటికే ప్రారంభమైందని చెబుతూ పోస్టులను వైరల్ అవుతున్నాయి.
ఒక ట్విటర్ వినియోగదారు ఈ వీడియోను “Collector’s Office Inauguration ceremony by a Mulla in Telangana. I told you that Islamization has already begun in India. #HindusUnderAttack.” అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పంచుకున్నారు.
పలువురు సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఈ వీడియోను అదే వాదనతో షేర్ చేశారు
నిజ నిర్ధారణ :
ఈ వాదన ప్రజలను తప్పుదోవ పట్టించేదిలా ఉందని న్యూస్‌మీటర్ కనుగొంది. నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి సంబంధించిన సుదీర్ఘ వీడియోను మేము గమనించాం. అందులో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు కలిసి ప్రార్థనలను చేశారని గుర్తించాం.
వీడియో కీఫ్రేమ్ యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించినప్పుడు, మేము జూన్ 4, 2023న స్థానిక వార్తా ఛానెల్ T News Telugu ప్రచురించిన వీడియోను కనుగొన్నాము “CM KCR Honors Nirmal Collector | KCR Inaugurates Nirmal Integrated Collectorate.” అంటూ వీడియోను అప్లోడ్ చేశారు.
ఈ వీడియోలో ఇద్దరు ముస్లిం మతపెద్దలు ఉన్న సారూప్య దృశ్యాలను చూపుతుంది. ఈ ప్రార్థన కార్యక్రమంలో ఇద్దరు పాస్టర్లు కూడా ఉన్నట్లు చూపిస్తుంది.
ఫుల్ వీడియోను జూన్ 4, 2023న “KCR LIVE: Inauguration Of BRS Party Office And Collectorate Building.” పేరుతో ప్రత్యక్ష ప్రసారం చేశారు. T News Telugu యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసిన వీడియోలో పూజారులు కూడా ఉన్నారు. దాదాపు 28:00 నిమిషాలకు హిందూ ఆచారాలకు సంబంధించి కార్యక్రమాలను పూర్తీ చేశారు. తదుపరి ఫ్రేమ్‌లలో 34:00 నిమిషాల తర్వాత.. ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు కనిపించారు.
నిర్మల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవం.. తెలంగాణ CMO అధికారిక YouTube ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారని మేము కనుగొన్నాము. ఈ వీడియో ప్రారంభోత్సవంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు పాల్గొన్నారు.
పూర్తీ వీడియోలో అన్ని ప్రధాన మతాల మత పెద్దలు ఉండడాన్ని మనం గమనించవచ్చు. వైరల్ వీడియో క్లిప్ ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam