Fact Check : నరేంద్ర మోదీ ఆఫీసులో ముకేశ్ అంబానీ దంపతుల ఫోటో ఉందా..?

Morphed Image Shows Mukesh Ambanis Photo Hanging On PMS Office Walls. భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో భారత

By Medi Samrat  Published on  13 March 2021 12:33 PM GMT
Fact Check : నరేంద్ర మోదీ ఆఫీసులో ముకేశ్ అంబానీ దంపతుల ఫోటో ఉందా..?
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అందులో గోడ మీద ఉన్న ఫోటోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ ఉన్నారు. వారి ఫోటోను మోదీ ప్రధానమంత్రి ఆఫీసు గోడలపై ఉంచారంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు. వారి ఫోటో మోదీ ఆఫీసులో ఉంచుకోవాల్సిన అవసరం ఏమిటా..? అని కూడా చర్చిస్తూ ఉన్నారు.





నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న ఫోటో 'పచ్చి అబద్ధం'.

భారత ప్రధాని నరేంద్ర మోదీ సచిన్ టెండూల్కర్ ను 2017 మే నెలలో కలిశారు. అప్పటి భేటీకి సంబంధించిన ఫోటోలు పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. వాటిలో ఎక్కడ కూడా ముకేశ్ అంబానీ జంట ఉన్నట్లుగా ఎటువంటి ఆధారాలు లభించలేదు.


సచిన్ టెండూల్కర్ తన భార్యతో కలిసి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' సినిమా కోసం మోదీని కలుసుకున్నారు. సచిన్ తన భేటీకి సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు కూడానూ.. అక్కడ కూడా ముకేశ్ అంబానీ జంట గోడ మీద ఉన్న ఫోటో ఫ్రేమ్ లో ఉన్నట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు. ఫోటోను మార్ఫింగ్ చేసి ముకేశ్ అంబానీ జంట ఫోటోను ఉంచినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది.




ఈ రెండు ఫోటోలలోనూ ఉన్న తేడాలను గమనించవచ్చు.

పలు మీడియా సంస్థలు కూడా వీరి భేటీకి సంబంధించిన కథనాలను ప్రచురించారు. ఎక్కడ కూడా ముకేశ్ అంబానీ జంట ఉన్న ఫోటో లేదు.

https://www.business-standard.com/article/current-affairs/tendulkar-briefs-pm-modi-about-sachin-a-billion-dreams-receives-blessings-117051900406_1.html

https://indianexpress.com/photos/sports-gallery/sachin-tendulkar-meets-prime-minister-narendra-modi-ahead-of-release-of-film-a-billion-dreams-4663485/

వైరల్ అవుతున్న ఫోటోను మార్ఫింగ్ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. ఒరిజినల్ ఫోటో 2017 సంవత్సరంలో తీశారు.


Next Story