భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆసుపత్రిలో ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. ఆయన ముకేశ్ అంబానీ మనవడిని చూడడానికి వెళ్లాడని చెబుతూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
'बंदा मालिक के पोते को देखने हॉस्पिटल पहुंच गया लेकिन किसानों से मिलने का समय नहीं है। जो 17 दिन से ऐसी ठंड और बरसात में खुले आसमान के नीचे बैठे हैं।" అంటూ పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు.
ఓ వైపు రైతులు అన్ని నెలలుగా రోడ్డు మీద నిలబడి ఉద్యమం చేస్తున్నా కూడా పట్టించుకోని నరేంద్ర మోదీ.. అంబానీకి మనవడు పుట్టాడని తెలియగానే హుటాహుటిన వెళ్లిపోయారు అంటూ పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు.
"రైతుల ఆందోళన స్థలానికి వెళ్లి వారితో మాట్లాడేందుకు సమయం ఉండదు కానీ ముకేష్ అంబానీకి మనవడు పుడితే హాస్పిటల్ వరకు వెళ్లి చూస్తే టైం ఉంటుంది." అంటూ తెలుగులో కూడా పోస్టులు పెడుతూ వచ్చారు. పోస్టులను వైరల్ చేశారు.
నిజ నిర్ధారణ:
భారత ప్రధాని నరేంద్ర మోదీ అంబానీ మనవడిని చూడడానికి ఆసుపత్రికి వెళ్లాడని వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
వైరల్ అవుతున్న ఫోటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఆ ఫోటో 2014 అక్టోబర్ కు చెందినది అని తెలుస్తుంది. సర్ హెచ్.ఎన్.రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసర్చ్ సెంటర్ ను అప్పట్లో ప్రారంభించారు.
https://www.indiainfoline.com/article/news-top-story/pm-in
https://www.indiatoday.in/india/story/modi-make-in-india-healthcare-digital-mumbai-pm-clean-neonatal-maternal-mortality-224540-2014-10-25
90 సంవత్సరాల ఆసుపత్రిని రిలయన్స్ ఫౌండేషన్ నీతా అంబానీ సారథ్యంలో అధునాతన సదుపాయాలతో తీర్చి దిద్దింది. హెల్త్ కేర్ కోసం ప్రత్యేకంగా ఎన్నో సదుపాయాలను ఈ సెంటర్ లో ఉంచారు. అప్పుడు నరేంద్ర మోదీ హాజరైనట్లు ఎన్నో మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. అలాగే ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా అప్లోడ్ చేశాయి. వాటిలో ఈ వైరల్ అవుతున్న ఫోటోను కూడా గమనించవచ్చు.
నరేంద్ర మోదీ అంబానీ మనవడిని చూడడానికి ఆసుపత్రికి వెళ్లాడని వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. 2014లో ముంబైలో సర్ హెచ్.ఎన్.రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసర్చ్ సెంటర్ ను ప్రారంభించినప్పటి ఫోటో.