Fact Check : కోవిడ్ అన్నదే లేని దేశంగా ఇజ్రాయెల్ నిలిచిందా..?

Isreal is not First Covid Free Country Viral Claim is Untrue. కరోనా మహమ్మారి ఎన్నో దేశాలలో ఇంకా టెన్షన్ పెడుతూ ఉండగా.. చాలా దేశాల్లో

By Medi Samrat  Published on  8 May 2021 8:34 PM IST
Fact Check : కోవిడ్ అన్నదే లేని దేశంగా ఇజ్రాయెల్ నిలిచిందా..?

కరోనా మహమ్మారి ఎన్నో దేశాలలో ఇంకా టెన్షన్ పెడుతూ ఉండగా.. చాలా దేశాల్లో కట్టడి చేస్తూ ఉన్నారు అధికారులు. అయితే గత కొద్దిరోజులుగా ఇజ్రాయెల్ దేశంలో కరోనా అన్నదే లేకుండా పోయిందనే కథనాలు వైరల్ అవుతూ ఉన్నాయి.

ఎంతో మంది నెటిజన్లు ఇజ్రాయెల్ దేశంలో కరోనా అన్నదే లేకుండా పోయిందని.. కోవిడ్ ఫ్రీ కంట్రీగా ఇజ్రాయెల్ మారిందని చెబుతూ ఉన్నారు. ప్రపంచంలో కరోనా లేని మొదటి దేశం ఇజ్రాయెల్ అంటూ పలువురు చెప్పుకొచ్చారు.

నిజ నిర్ధారణ:

ఇజ్రాయెల్ దేశంలో కరోనా కేసులు అన్నవే లేకుండా పోయాయని వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

మే 6, 2021న అధికారుల లెక్కల ప్రకారం ఇజ్రాయెల్ లో 1179 కోవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ లెక్క ప్రకారం ఇజ్రాయెల్ ఇంకా కోవిడ్-19 ఫ్రీ కంట్రీ అవ్వలేదు.

ఇజ్రాయెల్ హెల్త్ మినిస్ట్రీ కథనం ప్రకారం ఇంకా ఆదేశంలో 1123 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఇజ్రాయెల్ మే 3 న కూడా 232 కొత్త కేసులను ప్రకటించింది.. అలాగే 5 మంది చనిపోయినట్లు కూడా తెలిపింది. ఫిబ్రవరి 2020 నుండి కూడా ఇజ్రాయెల్ 838767 కరోనా కేసులు నమోదవ్వగా.. 6370 మరణాలు కూడా సంభవించాయి.

https://covid19.who.int/region/euro/country/il

https://datadashboard.health.gov.il/COVID-19/general

అయితే ఇజ్రాయెల్ దేశంలో కరోనా కేసులు బాగా తగ్గుతూ వచ్చాయి. ఇంకా కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్ దేశంలో మాస్క్ తప్పనిసరి కాదనే రూల్ ను పక్కనపెట్టారు. స్కూల్స్, బార్స్, రెస్టారెంట్స్ కు కూడా అనుమతులు ఇచ్చేసారు. బహిరంగప్రదేశాల్లో ప్రజలు ఎక్కువగా గూమి కూడి ఉన్నప్పుడు మాత్రమే మాస్కులు పెట్టుకోవాలని కోరారు.

ఆ దేశంలో వ్యాక్సినేషన్ ను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. 50 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఒకప్పుడు రోజూ 10000కు పైగా కరోనా కేసులు నమోదవ్వగా.. 200 కేసుల కంటే తక్కువగానే ఇప్పుడు నమోదవుతున్నాయి.

Worldometer లెక్కల ప్రకారం 11 దేశాలు, కొన్ని ప్రాంతాల్లో మే 6 నుండి కరోనా కేసులు కొత్తగా నమోదవ్వలేదు. తజికిస్తాన్, ఫాల్క్ ల్యాండ్ ఐలాండ్స్, మకావ్, గ్రీన్ ల్యాండ్, సెయింట్ పియర్రే, మికెలన్, మాంట్సిరెట్, సోలొమన్ ఐలాండ్స్, వనువాతు, మార్షల్ ఐలాండ్స్, సెయింట్ హెలెనా, మైక్రోనేషియాలో కొత్తగా కరోనా కేసులు నమోదవ్వలేదు.

ఇజ్రాయెల్ దేశం ప్రపంచంలోనే మొదటి కరోనా ఫ్రీ దేశం అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.


Next Story