ఆవు పేడ తినడంలో పేరుగాంచిన హర్యానాకు చెందిన ఓ వైద్యుడు కడుపులో ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రి పాలైనట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి.
"కర్నాల్‌కు చెందిన MBBS డాక్టర్ ఆవు పేడ తిని ఇతరులకు కూడా అలా చేయమని చాలా సార్లు సలహా ఇచ్చాడు, ఇప్పుడు కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చి ఆసుపత్రిలో చేరాడు" అని పోస్టులు పెడుతూ ఉన్నారు. "करनाल का एमबीबीएस डॉक्टर जो दूसरों को गोबर खाने की सलाह देता था खुद गोबर खा खा कर पेट में इन्फेक्शन कर बैठा पहुंचा मेडिकल" అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
ఫ్యాక్ట్ చెక్ టీమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. 2017లో GoFundMe పేజీలో కనిపించిన అసలైన ఫోటోకు మమ్మల్ని తీసుకెళ్లింది. అందులోని వివరాల ప్రకారం, ఫోటోలోని వ్యక్తి బిధాన్ థాపా, అతను జూలై 10, 2017న మరణించాడు. యునైటెడ్ స్టేట్స్ నుండి నేపాల్‌లోని అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి నిధుల సేకరణను ప్రారంభించారు.
అంతేకాకుండా మా బృందం డిసెంబర్ 14, 2021న IBN24 న్యూస్‌లో డాక్టర్ మనోజ్ మిట్టల్ ఇంటర్వ్యూను కనుగొంది. 3.27 నిమిషాల నిడివి సమయంలో అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని, ఆసుపత్రిలో చేరలేదని చెప్పుకొచ్చారు.
అలాగే, ఫిబ్రవరి 2021లో అదే ఫోటో వైరల్ అయినప్పుడు AFP సంస్థ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఇథియోపియా ప్రధానమంత్రి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారని కూడా అప్పట్లో ఇదే ఫోటోను వైరల్ చేశారు.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.