అకాలవర్షాల కారణంగా తెలంగాణలో పలు ప్రాంతాలలో రైతులు నష్టపోయారు. పంటను ధాన్యాన్ని చూస్తూ ఓ రైతు ఏడుస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉరుములతో కూడిన వర్షం కారణంగా పంట నష్టపోయినందుకు తెలంగాణ రైతు విలపిస్తున్న వీడియో క్లిప్‌ను సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న వీడియో పంటను కోల్పోయిన రైతుల బాధల ఆధారంగా తీసిన షార్ట్ ఫిల్మ్ లోని క్లిప్ అని న్యూస్ మీటర్ కనుగొంది.
వీడియో కీఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో, మేము 16 ఏప్రిల్ 2022న ‘ps creations’ అనే ఛానెల్ ద్వారా YouTubeలో ప్రచురించిన ఏడు నిమిషాల నిడివి గల చలనచిత్రాన్ని కనుగొన్నాము. చిత్రంలోని వైరల్ క్లిప్ 4.30 నిమిషాల సమయంలో కనిపిస్తుంది.
అదొక ఎమోషనల్ షార్ట్ ఫిల్మ్ అని.. క్యాప్షన్ పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ బృందం కూడా వీడియోను షేర్ చేసింది. ఇది ఒరిజినల్ కాదని.. షార్ట్ ఫిలిం వీడియో అని స్పష్టం చేసింది.
అకాల వర్షాల వల్ల తెలంగాణలో అనేక చోట్ల పంట నష్టం జరిగిన మాట వాస్తవం. అయితే పంట నష్టపోయిన ఒక రైతు ఆవేదన అంటూ ప్రచారం జరుగుతున్న ఈ వీడియో ఒక షార్ట్ ఫిల్మ్ లోనిది.
దయచేసి గమనించగలరు అంటూ ట్వీట్ చేశారు.
వైరల్ క్లిప్‌లో ఉన్నది తెలంగాణకు చెందిన రైతులు కాదు. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు అని మేము నిర్ధారించాము.
Credits : Md Mahfooz Alam