FactCheck : భారతీయ జనతా పార్టీ మూడు నెలల పాటూ ఫ్రీ రీఛార్జ్ ను ఇవ్వడం లేదు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మూడు నెలల పాటు ఉచిత రీఛార్జ్‌ను అందిస్తున్నట్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2023 3:16 PM GMT
FactCheck : భారతీయ జనతా పార్టీ మూడు నెలల పాటూ ఫ్రీ రీఛార్జ్ ను ఇవ్వడం లేదు

భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మూడు నెలల పాటు ఉచిత రీఛార్జ్‌ను అందిస్తున్నట్లు ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

ఈ మెసేజ్‌లో వ్యక్తిగత వివరాలను అడుగుతూ ఉన్నారు. బీజేపీ వెబ్‌సైట్‌కు సంబంధించిన లింక్ కూడా ఉంది. ఆ మెసేజీలో ఏ డేటాతో రీఛార్జ్ చేస్తారనే విషయాన్ని కూడా చెప్పడం లేదు.


“PM Narendra Modi is giving 3 Months Free recharge to all Indian users so that more and more people can vote for BJP in the 2024 elections and BJP government can be formed again. Click on the link given below to get 3 Months of Free Recharge. (Last Date - 31 OCTOBER 2023)... https://www.bjp.org@bjp2024.crazyoffer.xyz (sic)” అంటూ మెసేజీని షేర్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి 2024 ఎన్నికల్లో మరింత మంది ఓటు వేయాలనే కారణంతో ఉచితంగా రీఛార్జ్ చేస్తున్నట్లు ఆ మెసేజీలో చెప్పారు. మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఈ ప్రయత్నం అని మెసేజీలో తెలిపారు. అక్టోబర్ 31 ఆఖరి అవకాశం అని కూడా అందులో ఉంది.

నిజ నిర్ధారణ :

భారతీయ పౌరులకు బీజేపీ అలాంటి ఆఫర్లేమీ ఇవ్వడం లేదని NewsMeter ధృవీకరించింది. వ్యక్తిగత వివరాలను అడిగే వెబ్‌సైట్ బీజేపీకి లేదా భారత ప్రభుత్వానికి లింక్ చేయలేదు.

ఓటు వేయడానికి బీజేపీ ఉచిత రీఛార్జ్‌ను ఆఫర్ చేయడం గురించి మేము కీవర్డ్ సెర్చ్ చేసాము. కానీ విశ్వసనీయ మీడియా సంస్థల నుండి ఎటువంటి వార్తా నివేదికలు కనుగొనలేదు. కేంద్రంలోని అధికార పార్టీ అయిన బీజేపీ లేదా ఏదైనా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్ల కోసం ఇలాంటి ఆఫర్‌ను అందించి ఉంటే, మీడియాలో తప్పకుండా కథనాలు వచ్చి ఉండేవి.

మేము BJP వెబ్‌సైట్‌ని తనిఖీ చేసాము. కానీ అలాంటి ఆఫర్‌ల గురించి ఎటువంటి ప్రకటన కనుగొనలేదు. అసలు వెబ్‌సైట్ డొమైన్, నకిలీ వెబ్‌సైట్ మధ్య వ్యత్యాసాన్ని కూడా మేము గమనించాము. అసలు వెబ్‌సైట్ డొమైన్ పేరు ‘www.bjp.org/home’ అని ఉండగా.. నకిలీ వెబ్ సైట్ మీద ‘www.bjp.org@bjp2024.crazyoffer.xyz/’ అని ఉంది.

మేము వెబ్‌సైట్‌ను డొమైన్-చెకింగ్ వెబ్‌సైట్ Whois ద్వారా రన్ చేసాము. అది 'Crazyoffer.xyz' డొమైన్ పేరుతో ఆగస్టు 24, 2023న రిజిస్టర్ చేశారని.. వెబ్ సైట్ గడువు ఆగస్ట్ 24, 2024న ముగుస్తుందని తెలిపారు. వెబ్‌సైట్ లొకేషన్ అమెరికా అని కూడా అందులో ఉంది.


BJP పేరుతో ఉచిత రీఛార్జ్‌ను అందిస్తున్న వెబ్‌సైట్ ఫిషింగ్ వెబ్‌సైట్ అని మేము నిర్ధారించాము. లింక్‌పై క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను వెల్లడించవద్దని మేము ప్రజలను కోరుతున్నాం. కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.

Credits : Md Mahfooz Alam

Claim Review:భారతీయ జనతా పార్టీ మూడు నెలల పాటూ ఫ్రీ రీఛార్జ్ ను ఇవ్వడం లేదు
Claimed By:Whatsapp Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Whatsapp
Claim Fact Check:False
Next Story