సూపర్ స్టార్ రజనీకాంత్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించినట్లుగా ఉన్న ఓ పోస్టును సోషల్ మీడియా వినియోగదారులు వైరల్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ కు ఆపాదించబడిన కోట్‌ను షేర్ చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు కురిపిస్తున్నట్లు ఆ పోస్టులో తెలుస్తోంది.
'కేసీఆర్ గారిని ఓడించేందుకే 10 మంది ఒక్కటయ్యారు అంటే ,,తెలంగాణ రాష్ట్రం లో బలవంతుడు ఎవరో అర్థం అవుతోంది.
దటిజ్ కేసీఆర్' అంటూ పోస్టులను పెట్టడం గమనించవచ్చు." అని పోస్టులు పెడుతున్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న పోస్టుల్లోని వ్యాఖ్యలు రజనీకాంత్‌వే అనే వాదనలు అవాస్తవం. కేసీఆర్ పై రజనీకాంత్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. రజనీకాంత్ అలాంటి వ్యాఖ్యలు చేయడంపై న్యూస్‌మీటర్ ఎలాంటి వార్తా నివేదికలను కనుగొనలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కేసీఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే మీడియా (ముఖ్యంగా తెలుగు మీడియా) కచ్చితంగా రిపోర్ట్ చేసి ఉండేది.
రజనీకాంత్ ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాలలో కూడా మాకు అలాంటి పోస్ట్‌లు ఏవీ కనిపించలేదు. రజనీకాంత్ రాజకీయాలను విడిచిపెట్టి, 2018లో ప్రారంభించిన రాజకీయ పార్టీ అయిన రజనీ మక్కల్ మండ్రమ్‌ను రద్దు చేశారు. ఇది 'రజినీకాంత్ రసిగర్ నార్పని మండ్రం' లేదా 'రజనీకాంత్ ఫ్యాన్స్ వెల్ఫేర్ ఫోరమ్' గా మార్చబడింది. (మూలం: NDTV)
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కేసీఆర్ పై వైరల్ పోస్టుల్లోని వ్యాఖ్యలు చేయలేదు. కాబట్టి వైరల్ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.