నిజమెంత: ఏపీలో జరిగిన హత్యను బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులుగా ప్రచారం

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ (84) ప్రమాణ స్వీకారం చేశారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Aug 2024 10:00 AM IST
FactCheck, attack, Hindu,Bangladesh, Violence

నిజమెంత: ఏపీలో జరిగిన హత్యను బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులుగా ప్రచారం

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ (84) ప్రమాణ స్వీకారం చేశారు. యూనస్‌తో దేశాధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్దీన్‌ ప్రమాణం చేయించారు. బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్‌ హసీనా దేశం వదిలిపెట్టి వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే దేశాధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. ఫ్రాన్స్‌ నుంచి ఢాకాకు చేరుకున్న యూనస్‌ తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు.

నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ కొత్త మధ్యంతర ప్రభుత్వం ఏమి చేస్తుందో అనే భయాలు ప్రజలను వెంటాడుతూ ఉంది.

ఇక బంగ్లాదేశ్‌లోని రద్దీగా ఉండే రహదారిపై ఒక హిందువుపై దాడి జరిగిన వీడియో అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్‌గా మారాయి.

ఒక X వినియోగదారు వీడియోను (హెచ్చరిక: కలవరపరిచే విజువల్స్) షేర్ చేసారు, “అతని చేయి ముందుగా నరికేశారు. అతని తలపై బలంగా బాదారు. నాకు చెప్పడానికి మాటలు లేవు. #HindusAreNotSafeInBangladesh #jihad #USA #HindusUnderAttackInBangladesh (sic)” (ఆర్కైవ్) అంటూ పెట్టిన పోస్టులను పలువురు షేర్ చేశారు.



పలు సోషల్ మీడియా సైట్లలో ఈ వీడియోను షేర్ చేశారు. (ఆర్కైవ్) , (ఆర్కైవ్)

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని న్యూస్‌మీటర్ కనుగొంది. ఈ హత్య బంగ్లాదేశ్‌లో జరిగింది కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది.

న్యూస్‌మీటర్ 2024 జూలై 18న జరిగిన సంఘటనను ‘పల్నాడులో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్త దారుణంగా హత్య చేయడం, సెక్షన్ 144 విధించారు’ అనే శీర్షికతో ఒక నివేదికను పోస్టు చేశారు.



ఆంధ్రప్రదేశ్‌లోని వినుకొండలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తను టీడీపీ కార్యకర్త ఎలా హత్య చేశాడో నివేదికలో వివరించారు. నివేదిక ప్రకారం, బాధితుడు రషీద్‌ను టీడీపీ కార్యకర్తగా చెబుతున్న జిలానీ అత్యంత దారుణంగా దాడి చేశాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. రషీద్ చేతులు తెగిపోయాయని, బాధితుడి మెడకు బలమైన గాయం అయిందని, అతను రక్తస్రావంతో మరణించాడని నివేదిక పేర్కొంది. ఈ దాడిలో మతతత్వ ఉద్దేశం ఉందన్న ప్రస్తావన లేదు. మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఈ సంవత్సరం జూలై 18 నాటి X పోస్ట్‌లో కూడా వీడియోను కనుగొన్నాము.



'ఆంధ్రప్రదేశ్‌లోని వినుకొండలో ఓ వ్యక్తిని నరికి చంపారు, కెమెరాలో ఘటన రికార్డు అయింది' అనే శీర్షికతో 2024 జూలై 18న ది హిందూ ఘటన గురించి నివేదించింది. ఈ హత్య రాజకీయ ఉద్దేశాల కంటే వ్యక్తిగత శత్రుత్వం వల్లే జరిగిందని చెప్పింది.

కాబట్టి, ఆ వీడియో బంగ్లాదేశ్‌కు చెందినది కాదని మేము ధృవీకరించాం.

తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి వీడియోను ఉపయోగించడం ఇది మొదటిసారి కాదు.

గతంలో, NewsMeter ఇదే వీడియోను ఢిల్లీలో మతపరమైన దాడిగా తప్పుగా షేర్ చేశారంటూ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఢిల్లీలో రోహిత్ అనే హిందూ యువకుడిని జావేద్ అనే ముస్లిం వ్యక్తి హతమార్చి చంపినట్లుగా వీడియోను ప్రచారం చేయగా.. ఎలాంటి నిజం లేదని తెలిపింది.

అందువల్ల, వైరల్ అవుతున్న వీడియో ఆంధ్రప్రదేశ్‌కి చెందినది. బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లకల్లోలానికి సంబంధించినది కాదని మేము నిర్ధారించాము.

Credit: Sibahathulla Sakib

Claim Review:ఏపీలో జరిగిన హత్యను బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులుగా ప్రచారం
Claimed By:Social Media
Claim Reviewed By:Newsmeter
Claim Source:X users
Claim Fact Check:False
Next Story