ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో కూడిన స్టాంపు ఫొటో ఒకటి ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. టర్కీ దేశం ఈ స్టాంప్‌ను విడుదల చేసిందని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీని "ప్రపంచపు గొప్ప నాయకుడు" అని అభివర్ణించిందని పోస్టుల ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు.
"టర్కీ ప్రపంచంలోనే గొప్పనాయకుడని నరేంద్ర మోదీని కీర్తిస్తూ స్టాంప్‌ను ఆవిష్కరించింది.. ఇందుకు ప్రతి భారతీయుడు గర్వపడాలి'' అనే క్యాప్షన్‌తో నెటిజన్లు ఆ చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
2015లో టర్కీ ఈ స్టాంప్‌ను విడుదల చేసిందని, అయితే ఇది ప్రత్యేకంగా ప్రధాని మోదీ కోసం మాత్రమే కాదని NewsMeter బృందం కనుగొంది.
నవంబర్ 2015, బిజినెస్ టుడే నివేదిక ప్రకారం.. G20 లీడర్స్ సమ్మిట్‌కు హాజరైన సభ్యులందరికీ పర్సొనలైజెడ్ స్టాంపులు జారీ చేయబడ్డాయి. G20 టర్కీ సమ్మిట్ లీడర్స్ యొక్క ముప్పై-మూడు పర్సొనలైజెడ్ స్టాంపులను టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ G20 సమ్మిట్ జ్ఞాపకార్థం ఆవిష్కరించారు.
2.80 టర్కిష్ లిరా స్టాంప్‌పై 'నరేంద్ర మోదీ' చిత్రం మరియు భారత జాతీయ జెండా ఉంది. దిగువన "Narendra Modi - Prime Minister of Republic of India" అని రాసి ఉంది.
G20 Antalya Summit స్పెషల్ ఎడిషన్ స్మారక స్టాంపుల గురించి అధికారిక ప్రకటన మీరు చూడవచ్చు. మోదీ కోసం ప్రత్యేకంగా స్టాంప్‌ను విడుదల చేసి, ఆయనను "ప్రపంచంలోని గొప్ప నాయకుడు" అని పిలవలేదు.
టర్కీ ప్రభుత్వం 2015లో G20 లీడర్స్ సమ్మిట్‌కు హాజరైన ప్రధాని మోదీతో సహా అందరి నాయకుల స్టాంపును విడుదల చేసింది.