— Vinothkumar G Kshatriyan (@vino_gv) May 25, 2022
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.
NewsMeter ఇంటర్నెట్‌లో ఈ ఘటనకు సంబంధిత కీ వర్డ్స్ తో సెర్చ్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 మే 26న తమిళనాడును సందర్శించినట్లు నివేదించిన కథనాలను కనుగొన్నారు. ఆయన తమిళ భాష శాశ్వతమైనదని, తమిళ సంస్కృతిని మోదీ పొగిడారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.
మేము మే 22, 2022 నాటి ట్వీట్‌ని కనుగొన్నాము. ఇది ప్రధాని మోదీ చెన్నైకి వచ్చిన తేదీకి సంబంధించినది కాదు. ఆయన రాకముందే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయబడింది.
குடை கருப்பு நிறத்தில் இருக்கும், இல்ல வெள்ளை நிறத்தில் இருக்கும் இது என்ன காவி கலர்.
சமீப காலமாக அரசின் செயல்பாடுகள் கொஞ்சம் கூட சரி இல்ல இப்படியே போனா அடுத்த 10 வருசம் இல்ல எந்த ஜென்மத்திலும் @arivalayam ஆட்சிக்கு வராது. pic.twitter.com/9KmFK8OH0k
ఇంకా వెతికితే సోషల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ పీయూష్ మనుష్ ఫేస్‌బుక్ పోస్ట్ దొరికింది. పోస్ట్‌లో వైరల్ పోస్ట్‌కు సమానమైన చిత్రం ఉంది.
మేము వైరల్ చిత్రాన్ని జూమ్ చేసాము. రోటరీ క్లబ్, PFI తిరుమల, TMT బార్‌లు వంటి లోగోలు, పేర్లను గొడుగుపై చూడగలిగాము.
దీనిని ఒక క్లూగా తీసుకుంటే, ప్రకాష్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క స్ట్రక్చరల్ స్టీల్ విభాగం ప్రకాష్ ఫెర్రస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించినది అని మేము కనుగొన్నాము.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టులు మోదీ తమిళనాడు పర్యటనకు సంబంధించినది కాదని తెలుసుకున్నాం.