తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు భక్తులను ఆలయ హుండీలలో విరాళాలు వేయొద్దని కోరినట్లు సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల ఆలయ ఆదాయాన్ని రాష్ట్రంలోని క్రైస్తవ, ముస్లిం వర్గాల సంక్షేమం కోసం దుర్వినియోగం చేస్తున్నారని ప్రధాన అర్చకులు ఆరోపించినట్లుగా పోస్ట్ లో ఉంది.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న ఈ పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. రమణ దీక్షితులు అలాంటి ప్రకటనలేమైనా చేశారా అని వెతికితే, 2019 మార్చిలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తిరుమల ఆలయ హుండీ ఆదాయం వినియోగం గురించి ఆయన మాట్లాడినట్లు తెలిసింది. ఆలయ ఆదాయం వినియోగంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, ఆలయ హుండీ ఆదాయంలో 95% ప్రభుత్వమే వినియోగిస్తోందని తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించారు.
రమణ దీక్షితులు తిరుమల ఆలయ హుండీకి భక్తులు విరాళాలు ఇవ్వవద్దని, ఆ ఆదాయంలో ఒక్క రూపాయి కూడా వెంకటేశ్వర స్వామి సేవకు వినియోగించడం లేదని భక్తులకు చెప్పారు. రమణ దీక్షితులు మాట్లాడుతూ.. ఏ ఆలయ హుండీలో ఒక్క రూపాయి కూడా కానుకగా వేయవద్దని భక్తులందరినీ కోరుతున్నానన్నారు. తిరుమల దేవస్థానానికి ప్రతిరోజూ దాదాపు 2.5 నుంచి 3 కోట్ల వరకు ఆదాయం వస్తుందని, అయితే శ్రీవారి సేవకు ఒక్క రూపాయి కూడా వినియోగించలేదన్నారు. స్వామివారి సేవకు కావాల్సిన సరుకులు దాతలు సమకూరుస్తున్నారని వివరించారు. ఆలయ హుండీ ఆదాయాన్ని ఉద్యోగుల జీతాలకు, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌కు, ఇంజినీరింగ్ విభాగానికి, కాంట్రాక్టర్లకు ఆదాయాన్ని సమకూర్చేందుకు వినియోగించారన్నారు.
God gets things dear to Him done by selected good souls like your good self. That is the essence of GITA by Bhagwan Sri Krishna. God be with you in this sacred mission. https://t.co/nvnXU19S2v
రమణ దీక్షితులు భక్తులు ప్రత్యక్ష సేవలో పాల్గొనాలని, తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలకు డబ్బును విరాళంగా ఇవ్వాలని కోరారు. అలా చేస్తే పేద అర్చకుల జీతాలు, ఆలయానికి అవసరమైన వస్తువులను ఉపయోగించుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందు 2019 మార్చిలో రమణ దీక్షితులు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వంవచ్చాక 2021లో తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు తిరిగి ఎన్నికయ్యారు. అంతకు ముందు రమణ దీక్షితులు తిరుమల ఆలయ అధికారులపై పలు ఆరోపణలు చేశారు.