ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మాట్లాడినట్లుగా.. రాబోయే 2022 రాష్ట్ర ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉందని తెలిపిన రెండు న్యూస్ బులెటిన్‌ల స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రెండు చిత్రాలతో పాటు ఒక టెక్స్ట్ ఇలా ఉంది, "మోహన్ భగవత్‌ను కలిసిన తర్వాత, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ములాయం భావించారు." ఇంకొక ఒక స్క్రీన్‌షాట్‌లో "బీజేపీ అధికారంలోకి రావడాన్ని నేను చూస్తున్నాను. బీజేపీ-ఎస్‌పి జాతీయవాదం, సరిహద్దులు మరియు భాషపై ఒకే భావజాలాన్ని కలిగి ఉన్నాయి" అని ఉంది.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలి పెళ్లిలో ములాయం సింగ్ యాదవ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కలుసుకున్న తర్వాత ఈ స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. ఈ భేటీ రాజకీయంగా మారిందని మరికొందరు అంచనా వేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
NewsMeter ఒక కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. అయితే వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్స్ కు సంబంధించి 12 అక్టోబర్ 2015 సమయంలో సమాచార్ ప్లస్ ద్వారా అసలైన వార్తల బులెటిన్‌ను కనుగొంది మా బృందం. వీడియోలో, ములాయం సింగ్ 2015 బీహార్ ఎన్నికల గురించి.. బీహార్‌లో BJP అధికారంలోకి వచ్చే అవకాశం గురించి మాట్లాడుతున్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, జాతీయవాదం, సరిహద్దులు, భాషపై బీజేపీ, ఎస్పీలు ఒకే భావజాలంతో ఉన్నాయని ములాయం చెప్పినట్లు యాంకర్ పేర్కొన్నారు.
వైరల్ స్క్రీన్‌షాట్‌లకు సంబంధించి అసలు వీడియో స్క్రీన్‌షాట్‌లతో పోల్చాము. ఛానెల్ లోగో మరియు తేదీ తీసివేయబడినట్లు స్పష్టంగా చూడవచ్చు.
అప్పట్లో ములాయం వ్యాఖ్యలబై పలు వార్తా ఛానళ్లు నివేదించాయి. బీహార్‌లో ఓటింగ్ సందర్భంగా ఆ రాష్ట్రంలో బీజేపీ గెలిచే అవకాశం ఉందని ములాయం చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచిందని నవభారత్ టైమ్స్ పేర్కొంది. ములాయం బీజేపీని ప్రశంసించారని, భాష, సరిహద్దులు మరియు దేశభక్తి వంటి విషయాలపై తమ పార్టీకి, బీజేపీకి ఒకే విధమైన అభిప్రాయాలు ఉన్నాయని ములాయం చెప్పారని ఇండియా టీవీ నివేదించింది.
వైరల్ స్క్రీన్‌షాట్‌లలో చేసిన వాదనలు అవాస్తవమని స్పష్టమైంది. ములాయం సింగ్ యాదవ్ 2015 బీహార్ ఎన్నికల గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. అంతేకానీ 2022 లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయలేదు.
కాబట్టి వైరల్ పోస్టులు 'ప్రజలను తప్పుద్రోవ పట్టించే విధంగా ఉన్నాయి'.