FactCheck : టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఓడిపోయినందుకు అక్షయ్ కుమార్, జై షా ఆనందంతో సెలబ్రేట్ చేసుకున్నారా..?

Did Akshay Kumar Jay Shah Celebrate Indias Defeat in T20 World Cup. టీ20 ప్రపంచ కప్ లో భారత్ వరుస ఓటములను ఎదుర్కొంటూ వెళుతోంది. మొదటి మ్యాచ్ లో

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2021 9:55 AM IST
FactCheck : టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఓడిపోయినందుకు అక్షయ్ కుమార్, జై షా ఆనందంతో సెలబ్రేట్ చేసుకున్నారా..?

టీ20 ప్రపంచ కప్ లో భారత్ వరుస ఓటములను ఎదుర్కొంటూ వెళుతోంది. మొదటి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ చేతిలో ఘోర ఓటమిని చవి చూసింది. ఆ మ్యాచ్ లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక భారత్ సెమీఫైనల్స్ చేరాలంటే అద్భుతాలే జరగాలని అంటున్నారు.


అక్టోబర్ 24న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను పాకిస్తాన్ ఓడించిన తర్వాత, అనేక వీడియోలు మరియు పోస్ట్‌లు సోషల్ మీడియాలో వివిధ వాదనలతో విస్తృతంగా షేర్ చేయబడుతున్నాయి. నటుడు అక్షయ్ కుమార్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) సెక్రటరీ జయ్ షా పాకిస్తాన్ విజయాన్ని వారు సెలెబ్రేట్ చేసుకున్నారనే వాదనతో ఫోటో వైరల్ అవుతోంది.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

న్యూస్ మీటర్ వైరల్ పోస్టుపై గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా India.com అక్టోబర్ 24 న "BCCI Secretary Jay Shah and Akshay Kumar Celebrates After Over-Throw From Shaheen Afridi in India vs Pakistan Match" అంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. పాకిస్తాన్ తో మ్యాచ్ లో ఓవర్ త్రోను వీళ్లు ఎంజాయ్ చేస్తున్న పోస్టు అది.

"19వ ఓవర్ సమయంలో, షాహీన్ అఫ్రిది ఓవర్‌త్రో కారణంగా పాకిస్తాన్ 4 పరుగులు భారత్ కు సమర్పించుకుంది, మొత్తం భారత అభిమానులు వారి సీట్ల నుండి లేచి సంబరాలు చేసుకున్నారు. హీరో అక్షయ్ కుమార్, జే షాతో కలిసి సంబరాలు చేసుకుంన్నారు." అన్నది స్ఫష్టంగా తెలుస్తోంది. మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరూ ఇదే విషయాన్ని గమనించారు.

ఈ వీడియోను పలు యూట్యూబ్ ఛానల్స్ లోనూ, ట్విట్టర్ ఖాతాలోనూ షేర్ చేశారు. Cricket Videos, CricketSpyOfficial, SJ Amazing and Cricket Lovers అనే యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోను అప్లోడ్ చేశారు. "This match is such an emotion for everyone....#AkshayKumar cheers for team team india on overthrow 18.5 overs." అంటూ ట్విట్టర్ యూజర్లు పోస్టులు పెట్టారు.

కాబట్టి వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఓడిపోయినందుకు అక్షయ్ కుమార్, జై షా ఆనందంతో సెలబ్రేట్ చేసుకోలేదు.


Claim Review:టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఓడిపోయినందుకు అక్షయ్ కుమార్, జై షా ఆనందంతో సెలబ్రేట్ చేసుకున్నారా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Twitter Users
Claim Fact Check:False
Next Story