బాలీవుడ్‌కి వ్యతిరేకంగా ఒక మహిళ ప్లకార్డ్ పట్టుకున్న చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ సినిమాలు పాటలలో ఇస్లామిక్ కంటెంట్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలతో బాలీవుడ్‌పై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో నిరసన తెలియజేస్తుందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
నిజనిర్ధారణ:
వైరల్ అవుతున్న ఫోటోలు.. గాలి వార్తలు.
న్యూస్‌మీటర్ వైరల్ ఇమేజ్ యొక్క గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించింది. ఇది గెట్టి(getty) ఇమేజ్‌ల వెబ్‌సైట్‌కు తీసుకుని వెళ్ళింది. వెబ్‌సైట్ ప్రకారం, డిసెంబర్ 20, 2012 న అమృత్‌సర్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో న్యూఢిల్లీలో అత్యాచారానికి వ్యతిరేకంగా భారతీయ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. అంతే తప్ప బాలీవుడ్ కు వ్యతిరేకంగా కాదు..!
లైంగిక వేధింపులు తరచుగా "టీజింగ్" గా కొట్టిపారేయడం మరియు బాధితులు దాడులకు తమను తాము నిందించుకోవడం వంటి దుశ్చర్యలు భారతదేశంలో విస్తృతంగా ఉన్నాయని కథనాల్లో అంటున్నారు. డిసెంబర్ 16న న్యూఢిల్లీలో బస్సులో 23 ఏళ్ల యువతిని అత్యాచారం చేయడం.. ఆమె ప్రాణాల కోసం పోరాడుతున్న సమయంలో దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.
మేము డిసెంబర్ 21, 2012 న 'ఢిల్లీ బస్సు గ్యాంగ్ రేప్‌లో ఐదవ అరెస్ట్' శీర్షికతో BBC న్యూస్ ద్వారా వార్తా నివేదికను కనుగొన్నాము. ఆ వార్తా కథనానికి ఇదే చిత్రాన్ని ఉపయోగించారు.
డిసెంబర్ 20, 2012 న డైలీ న్యూస్ ప్రచురించిన మరో నివేదిక కూడా ఇదే చిత్రాన్ని ఉపయోగించింది. 'భారతీయ మహిళలు హింసతోనూ భయంతోనూ జీవిస్తున్నారు, బస్సులో 23 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం నిరసనలకు దారితీసింది' అని అందులో ఉంది.
కాబట్టి బాలీవుడ్ కు వ్యతిరేకంగా వైరల్ అవుతున్న ఈ ఫోటో ఒక బూటకమని స్పష్టమవుతోంది. ఆ అమ్మాయి 'బాయ్ కాట్ బాలీవుడ్' ప్లకార్డ్ పట్టుకోలేదు. 'ఎలా దుస్తులు ధరించాలో నాకు చెప్పవద్దు! అత్యాచారం చేయవద్దని వారికి చెప్పండి !! ' అని ఒరిజినల్ ఫోటోలో ఉంది.