లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించకూడదని.. ప్రభుత్వాలు తీసుకుని వచ్చిన నియమాలను పాటించాలని పోలీసులు కోరుతూ ఉన్నారు. అయినా ఏదో ఒక వంకతో బయటకు వస్తూ ఉన్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. భారీగా జరిమానాలు విధిస్తూ ఉన్నారు అధికారులు.


https://www.facebook.com/prasunku/videos/4634715039893910/

అయితే నిబంధనలను ఉల్లంఘించి రోడ్ల మీదకు వచ్చిన వారికి పోలీసులు హారతి పడుతూ ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిని కొట్టకూడదని కర్ణాటక హై కోర్టు చెప్పిందని.. అందుకే పోలీసులు హారతి ఇస్తూ ఉన్నారని ఓ ఫేస్ బుక్ యూజర్ తెలిపారు. కర్ణాటక పోలీసులు ఇలా లాక్ డౌన్ సమయంలో బయటకు వస్తున్న వారికి హారతి ఇస్తూ ఉన్నారని తెలిపారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న వీడియో ఇప్పటిది కాదు. ఇది పాత వీడియో.

వీడియోకు సంబంధించిన కీవర్డ్ సెర్చ్ చేయగా ఏప్రిల్ 12, 2020న The Khabardar News అనే యుట్యూబ్ ఛానల్ లో వీడియోను మొదట అప్లోడ్ చేశారు.


మధ్యప్రదేశ్ లోని రేవా ప్రాంతంలో పోలీసులు ఈ పని చేశారు. అంతేకాకుండా ప్రజలకు కరోనా కారణంగా తలెత్తే ఇబ్బందుల గురించి కూడా చెప్పుకొచ్చారు. మాస్కులు వేసుకోకుండా ఉంటే వచ్చే ఇబ్బందులు.. ఇలాంటి ఎన్నో విషయాలను ప్రజలకు పోలీసులు వివరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, బైక్ లపై వెళుతుంటే హెల్మెట్లు ధరించాలని సూచించారు.

"Rewa MP, Madhya Pradesh Police lockdown todne walon ki aarti utaar rahi hai Rewa MP#KeepSharing #MyBhopal." అంటూ వీడియోలను పోస్టు చేశారు. ఏప్రిల్ 11, 2020న ఈ వీడియోను అప్లోడ్ చేశారు.

https://www.facebook.com/watch/?v=533435774245064

Naiduniya.com కథనాల్లో కూడా ఈ వీడియో రేవా ప్రాంతంలో చోటు చేసుకుందని తెలిపారు. పోలీసులు హారతి ఇచ్చి.. తిలకాన్ని పెట్టి.. పూలు కూడా వేశారు.

కర్ణాటకలో ఈ మధ్య ఈ ఘటన చోటు చేసుకుందని వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా ప్రాంతంలో చోటు చేసుకుంది.


Claim Review :   లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి కర్ణాటక పోలీసులు హారతి పట్టారా..?
Claimed By :  Facebook Users
Fact Check :  False

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story