కొత్త విద్యా విధానం (ఎన్‌ఈపీ) ప్రకారం 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్‌ను నిలిపివేస్తున్నట్లు ఓ మెసేజీ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. బోర్డు పరీక్ష కేవలం 12వ తరగతికి మాత్రమే నిర్వహించబడుతుందని, 10వ తరగతికి పరీక్షలు ఉండకుండా కొత్త NEPకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని సందేశంలో ఉంది.
నిజ నిర్ధారణ :
NewsMeter ఈ వైరల్ పోస్టులకు మద్దతు ఇచ్చే నివేదికలు, నోటీసుల కోసం తనిఖీ చేసింది. కానీ ఏదీ కనుగొనబడలేదు. అటువంటి ప్రకటన ఏ అధికారిక మూలాల ద్వారా కనుగొనబడలేదు.
న్యూస్ మీటర్ బృందం కొత్త NEP 2020 వెర్షన్‌ని తనిఖీ చేసింది. "10, 12 తరగతులకు బోర్డు పరీక్షలు కొనసాగుతుండగా, ప్రస్తుతం ఉన్న బోర్డు ప్రవేశ పరీక్షల విధానంలో కోచింగ్ తరగతులు చేపట్టాల్సిన అవసరాన్ని తొలగించేందుకు సంస్కరించబడతాయి" అని NEP తెలిపింది. NEP కింద 10వ తరగతికి సంబంధించిన బోర్డు పరీక్షలు నిలిపివేయబడవని స్పష్టంగా తెలుస్తోంది. అందులో అలాంటి మార్పులేమీ చేయలేదు.
10వ CBSE బోర్డు పరీక్షలు ఏప్రిల్ 2022లో జరిగే అవకాశం ఉంది. తెలంగాణ బోర్డు 10వ తరగతి పరీక్షలు మే 11 నుండి మే 20, 2022 వరకు జరుగుతాయి. 'ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా' వైరల్ సందేశాన్ని ఫేక్ అని కొట్టిపారేసింది. విద్యా మంత్రిత్వ శాఖ నుంచి అలాంటి ప్రకటన వెలువడలేదని పేర్కొంది.
A #Whatsapp message claims that according to the New Education Policy, there will be no board exams for class 10th.#PIBFactCheck: