FactCheck : సీబీఎస్ఈ 10,12వ తరగతులకు షెడ్యూల్ ను విడుదల చేశారా..?

Beware CBSE has still not announced examination dates for class x xii. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12 తరగతులకు మే 4, 2022

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Feb 2022 7:36 AM GMT
FactCheck : సీబీఎస్ఈ 10,12వ తరగతులకు షెడ్యూల్ ను విడుదల చేశారా..?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12 తరగతులకు మే 4, 2022 నుండి పరీక్షలను నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించిన వాట్సాప్‌ సందేశం విస్తృతంగా షేర్ చేయబడుతోంది.

మార్చి 1, 2022 నుండి 12వ తరగతికి సంబంధించిన ప్రాక్టికల్/ప్రాజెక్ట్/ఇంటర్నల్ అసెస్‌మెంట్ నిర్వహించడానికి అనుమతించారని వైరల్ సందేశం పేర్కొంది. 10, 12వ తరగతి పరీక్షల తేదీ షీట్‌లు త్వరలో జారీ చేయబడతాయని అందులో తెలిపింది. సీబీఎస్‌ఈ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది అని అందులో ఉంది.

నిజ నిర్ధారణ :

వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.

NewsMeter దీనిపై కీవర్డ్ సెర్చ్ ను చేసింది. 2020లో చేసిన కొన్ని ట్వీట్‌లకు దారితీసింది. వైరల్ సందేశం యొక్క టెక్స్ట్‌కు సమానమైన ట్వీట్‌ని ఒక వినియోగదారుడు డిసెంబర్ 31, 2020న షేర్ చేసారు. "10-12 తరగతి విద్యార్థులు. పరీక్షలు మే 4 నుండి జూన్ 10 వరకు ఉంటాయి. మార్చి 1 నుండి ప్రాక్టికల్ పరీక్షలు!" ("Students of class 10-12. The exams are from May 4 to 10 June. Practical exams from 1 March!") అని ట్వీట్ ఉంది.అంతేకాకుండా.. డిసెంబర్ 31, 2020న 'అమర్స్ మ్యాథ్స్ క్లాస్' అనే వినియోగదారుడు చేసిన మరో ట్వీట్‌ను మేము కనుగొన్నాము. ఆ ట్వీట్‌కి జోడించిన ఆర్టికల్ లింక్‌ కూడా షేర్ చేశారు. "Union Education Minister Ramesh Pokhriyal Nishank announced the dates of the #CBSE2021 class 10th and 12th boards exams. The #CBSE exam will be held from May 4 to June 10 and the results will be declared by July 15," అని అందులో ఉంది.

https://t.co/CKT2vviOe3

మేము ఫిబ్రవరి 01, 2022న CBSE అధికారిక అకౌంట్ లోని ట్వీట్‌ని కనుగొన్నాము. వైరల్ పోస్టును బోర్డు తిరస్కరించింది. నోటిఫికేషన్ నకిలీదని బోర్డు పేర్కొంది.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా బోర్డు అటువంటి నోటిఫికేషన్‌ను జారీ చేయలేదని పేర్కొంటూ వైరల్ పోస్ట్ ను ఖండించింది.


ఫిబ్రవరి 02, 2022న హిందుస్తాన్ టైమ్స్ ప్రచురించిన నివేదిక ప్రకారం, "సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, CBSE 2022 సంవత్సరానికి సంబంధించిన 10, 12వ తరగతి బోర్డు పరీక్ష తేదీలను కలిగి ఉన్న సర్క్యులర్‌పై నకిలీ నోటీసుకు వ్యతిరేకంగా విద్యార్థులను హెచ్చరించింది. CBSE బోర్డ్ ఎగ్జామ్స్ 2022 తేదీలు, అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి. బోర్డ్ ఇంకా టర్మ్ 2 పరీక్ష తేదీలను విడుదల చేయలేదు. బోర్డు టర్మ్ 1 ఫలితాలను ఇంకా విడుదల చేయలేదు. ఫలితాలు, పరీక్ష తేదీలు రెండూ విడుదల చేయగానే CBSE యొక్క అధికారిక సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంటాయి " అని ఉంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) త్వరలో 10, 12 టర్మ్ 1 పరీక్షల ఫలితాలను ప్రకటించబోతోంది.. 10, 12వ టర్మ్ 1 ఫలితాలు ఈ వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని అధికార ప్రతినిధి రామ శర్మ తెలిపారు. 10వ, 12వ టర్మ్ 1 ఫలితాలు ఈ వారంలో ప్రకటించబడతాయా అని అడిగినప్పుడు, విద్యార్థులు 10, 12వ తరగతి స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్లలో- cbse.gov.in, cbseresults.nic.inలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బోర్డు వెబ్‌సైట్‌లు కాకుండా, 10వ, 12వ ఫలితాలను తనిఖీ చేయడానికి ఇతర అధికారిక పద్ధతులలో DigiLocker యాప్, వెబ్‌సైట్ - digilocker.gov.in ఉన్నాయి. గత సంవత్సరం లాగా, ఫలితం UMANG యాప్‌లో, SMS ద్వారా కూడా అందుబాటులో ఉండవచ్చని NDTV కథనంలో తెలిపింది.మేము చివరిగా CBSE అధికారిక వెబ్‌సైట్‌లో వైరల్ నోటిఫికేషన్ గురించి సెర్చ్ చేశాం. సెర్చ్ చేస్తున్న సమయంలో, మేము పరీక్ష విభాగానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కనుగొన్నాము. అందులో నోటిఫికేషన్ లెటర్ డిసెంబర్ 31, 2020 నాటిది ఉంది. కొత్తదేవీ కనిపించలేదు.కాబట్టి వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. CBSE బోర్డ్ ఎగ్జామినేషన్ 2022కి సంబంధించి అటువంటి నోటిఫికేషన్ ఏదీ జారీ చేయలేదు. వైరల్ నోటిఫికేషన్ 2020కి సంబంధించినది, ఇది ఈ మధ్య మళ్లీ షేర్ చేయబడుతోంది.


Claim Review:సీబీఎస్ఈ 10,12వ తరగతులకు షెడ్యూల్ ను విడుదల చేశారా..?
Claim Fact Check:False
Next Story
Share it